ఇన్‌చార్జి ఎస్పీగా మణికంఠ బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:52 AM
జిల్లా ఇన్‌చార్జి ఎస్పీగా మణికంఠ శనివారం తిరుపతి ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఈయన్ను తిరుపతి జిల్లాకు ఇన్‌చార్జిగా నియమించారు.
తిరుపతి(నేరవిభాగం), జనవరి 11(ఆంధ్రజ్యోతి): జిల్లా ఇన్‌చార్జి ఎస్పీగా మణికంఠ శనివారం తిరుపతి ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఈయన్ను తిరుపతి జిల్లాకు ఇన్‌చార్జిగా నియమించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్పీగా పనిచేసిన సుబ్బరాయుడును ప్రభుత్వం హెడ్ క్వార్టర్‌కు బదిలీ చేసిన విషయం విదితమే. మణికంఠ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.