ఇక ‘పీఎంఏవై- ఎన్టీఆర్ నగర్’
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:46 AM
సొమ్ము ఒకడిది.. సోకు మరొకడిది.. అన్నట్లు వైసీపీ ప్రభుత్వ తీరు సాగింది.పేదల ఇళ్ల నిర్మాణానికి అవసరమై న ఖర్చు మొత్తాన్ని ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం అందించింది.
527 జగనన్న కాలనీల పేరు మార్పు
చిత్తూరు, జనవరి11 (ఆంధ్రజ్యోతి): సొమ్ము ఒకడిది.. సోకు మరొకడిది.. అన్నట్లు వైసీపీ ప్రభుత్వ తీరు సాగింది.పేదల ఇళ్ల నిర్మాణానికి అవసరమై న ఖర్చు మొత్తాన్ని ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం అందించింది.అలా జిల్లా లో సుమారు 78వేల మందికి రూ.1.80 లక్షల చొప్పున యూనిట్ కాస్ట్‌ను కేటాయించింది. కానీ, వైసీపీ ప్రభుత్వం ఆయా పేదల కాలనీలకు మాత్రం వైఎస్సార్ జగనన్న కాలనీలుగా పేరును పెట్టుకుంది. కూటమి ప్రభుత్వం ఆ కాలనీ పేరును ‘పీఎంఏవై- ఎన్టీఆర్ నగర్’గా మారుస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. 2020 మార్చి 20వ తేదీన అప్పటి వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీలుగా పేరు పెట్టి ఉత్తర్వులను విడుదల చేయగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్త పేరు పెడుతూ శుక్రవారం ఉత్తర్వులను ఇచ్చింది. ఈ రకంగా ఉమ్మడి జిల్లాలో 527 జగనన్న లేఅవుట్ల పేరు మారనుంది.