ముగ్గురు తహసీల్దార్లకు పదోన్నతి
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:54 AM
తహసీల్దార్లకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పోస్టింగ్స్ కేటాయించారు.
తిరుపతి(కలెక్టరేట్), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): తహసీల్దార్లకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పోస్టింగ్స్ కేటాయించారు. అందులో భాగంగా జిల్లాలో అత్యంత కీలకమైన ప్రోటోకాల్ -1, ప్రోటోకాల్-2, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు భర్తీ చేసింది. ప్రోటోకాల్-1 ఎస్‌డీసీగా శివశంకర్‌నాయక్, ప్రోటోకాల్-2 ఎస్‌డీసీగా సువర్ణమ్మ నియమితులయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐసీసీ) తిరుపతి జోనల్ మేనేజరుగా విజయభారత్‌రెడ్డిని నియమించారు.