Share News

కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ

ABN , Publish Date - Jan 01 , 2025 | 01:46 AM

పోలీసు కానిస్టేబుల్‌ అభ్యర్థుల దేహదారుఢ్య, సామర్థ్య పరీక్షలు రెండో రోజైన మంగళవారం కూడా పోలీసు పెరేడ్‌ మైదానంలో కొనసాగాయి. 600 మంది అభ్యర్థులకు గాను 403 మంది హాజరుకాగా 159 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు.

కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ
పరుగుపందేన్ని పర్యవేక్షిస్తున్న ఎస్పీ మణికంఠ

చిత్తూరు అర్బన్‌, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): పోలీసు కానిస్టేబుల్‌ అభ్యర్థుల దేహదారుఢ్య, సామర్థ్య పరీక్షలు రెండో రోజైన మంగళవారం కూడా పోలీసు పెరేడ్‌ మైదానంలో కొనసాగాయి. 600 మంది అభ్యర్థులకు గాను 403 మంది హాజరుకాగా 159 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఎస్పీ మణికంఠ పర్యవేక్షణలో రెండో రోజు కూడా అధికారులు, సిబ్బంది సమక్షంలో పోలీసు కానిస్టేబుల్‌ అభ్యర్థుల అర్హత పరీక్షలను నిర్వహించారు. హాజరైన 403 మందికి సర్టిఫికెట్ల పరిశీలన, ఫిజికల్‌ మెజెర్మెంట్‌లో భాగంగా ఎత్తు, ఛాతీని కొలిచారు. అనంతరం ఫిజికల్‌ ఎపిషియన్సీ పరీక్షలు నిర్వహించగా 159మంది రాత పరీక్షకు హాజరయ్యారు.నిబంధనల ప్రకారం 1600 మీటర్ల పరుగు పందెం, 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్‌ పోటీలు నిర్వహించారు.ఏఆర్‌ ఏఎస్పీ శివానందకిశోర్‌, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్‌, ఏఆర్‌ డీఎస్పీలు చిన్నికృష్ణ, మహబూబ్‌ బాషా, ఎస్‌బీ సీఐలు భాస్కర్‌, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 01:46 AM