Share News

బులుగు పోయె.. పసుపు వచ్చె.. ఢాం..ఢాం..ఢాం!

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:45 AM

వైసీపీ అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వ భవనాలకీ, ప్రభుత్వం కట్టించిన పేదల ఇళ్లకీ, ఆఖరికి చెట్లకీ, కరెంటు స్తంభాలకు కూడా పార్టీ రంగులేసి నవ్వుల పాలయ్యారు.

బులుగు పోయె.. పసుపు వచ్చె.. ఢాం..ఢాం..ఢాం!

వైసీపీ అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వ భవనాలకీ, ప్రభుత్వం కట్టించిన పేదల ఇళ్లకీ, ఆఖరికి చెట్లకీ, కరెంటు స్తంభాలకు కూడా పార్టీ రంగులేసి నవ్వుల పాలయ్యారు. ప్రభుత్వ సొమ్ముతో పార్టీ సోకులా అని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా జగన్‌ బాటలోనే నడుస్తున్నట్లు ఉంది. దామినేడులోని ఇందిరమ్మ ఇళ్ల రిపేరు పనులు చేస్తూ పనిలోపనిగా పసుపు రంగు వేస్తున్నారు. అధికారుల అత్యుత్సాహమో.. నాయకుల ఆదేశమోగానీ దారిన పోయేవారు ఈ రంగు చూసి.. ‘అప్పుడు వారూ.. ఇప్పుడు వీరూ.. సేమ్‌ టు సేమ్‌’ అనుకుంటున్నారు.

- తిరుచానూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Jan 02 , 2025 | 01:45 AM