Share News

జిల్లా ఓటర్ల సంఖ్య 15,68,788

ABN , Publish Date - Jan 07 , 2025 | 02:19 AM

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.

జిల్లా ఓటర్ల సంఖ్య 15,68,788

అన్ని నియోజకవర్గాల్లో మహిళలే అధికం

ఫొటో ఓటర్ల తుది జాబితా విడుదల

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం కలెక్టరేట్‌లో ఫొటో ఓటర్ల తుది జాబితాను జిల్లా అధికారులు విడుదల చేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తుది ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు 15,68,788 మంది ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 7,96,637 మంది, పురుష ఓటర్లు 7,72,079 మంది, ఇతరులు 72 మంది ఉన్నారు. అత్యధికంగా పలమనేరు నియోజకవర్గంలో 2,69,065 మంది ఓటర్లు ఉండగా, అత్యత్పంగా నగరిలో 2,02,709 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు అత్యధికంగా పలమనేరులో 1,35,931 మంది ఉండగా, అత్యల్పంగా గంగాధరనెల్లూరులో 1,03,486 మంది ఉన్నారు. థర్డ్‌ జెండర్‌.. చిత్తూరులో 31, కుప్పంలో 18 మంది ఉన్నారు. జిల్లాలో సర్వీసు ఓటర్లు 3260, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 168, పీడబ్ల్యూడీ ఓటర్లు 23,499 మంది ఉన్నారు. 18-19 ఏళ్ల మధ్య వయసు కల్గిన యువఓటర్లు 20,446 మంది ఉన్నారు. జిల్లా ఎన్నికల సంఘం 2024 అక్టోబరు 29న విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 15,66,502 మంది ఓటర్లు ఉండగా, ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశం మేర 2286 మంది కొత్తగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో మహిళలు 1472, పురుష ఓటర్లు 815 మంది ఉన్నారు. తుది ఓటరు జాబితాలను కలెక్టరేట్‌తోపాటు ఏడు నియోజకవర్గ మండలకేంద్రాల్లో, అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకోసం అందుబాటులో ఉంచారు. జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకోవచ్చని ఓటర్లకు తెలిపారు.

Updated Date - Jan 07 , 2025 | 02:19 AM