Share News

సంవత్సరాదిన విషాదం

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:22 AM

అందరూ ఆంగ్ల సంవత్సరాది వేడుకల్లో మునిగి తేలుతున్న సమయాన నగరి పట్టణ పరిధిలో విషాదం నెలకొంది.

సంవత్సరాదిన విషాదం
కుశస్థలి నదిలో బాలుడి కోసం గాలిస్తున్న అగ్నిమాపక సిబ్బంది, విద్యార్థి మజీద్‌ (ఫైల్‌ ఫొటో)

కుశస్థలి నదిలో విద్యార్థి గల్లంతు

మూడు గంటల తర్వాత మృతదేహం లభ్యం

నగరి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): అందరూ ఆంగ్ల సంవత్సరాది వేడుకల్లో మునిగి తేలుతున్న సమయాన నగరి పట్టణ పరిధిలో విషాదం నెలకొంది. ఇందిరానగర్‌కు చెందిన మజీద్‌(15)బుధవారం సాయంత్రం 4.30 గంటలకు కుశస్థలీ నదిలో కొట్టుకుపోయాడు.నగరి వశిష్ట పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మజీద్‌ సరదాగా స్నేహితులతో కలిసి రామ్‌నగర్‌.సి ఏరియాకి సమీపంలో ఉన్న కుశస్థలీ నది వద్దకు వెళ్లాడు.పొరబాటున కాలువలో పడి అదృశ్యమయ్యాడు. భయభ్రాంతులకు గురైన స్నేహితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సుమారు మూడు గంటలకు పైగా గాలించిన తర్వాత నదిలో మజీద్‌ మృతదేహం లభ్యమైంది.మజీద్‌ మృతదేహం చూసిన కుటుంబసభ్యులు,బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Updated Date - Jan 02 , 2025 | 01:22 AM