Share News

సీఎం, గవర్నర్లకు టీటీడీ వేదాశీర్వవచనం

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:39 AM

నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉండవల్లిలోని నివాసంలో టీటీడీ వేదపండితులు వేదాశీర్వచనం అందజేశారు.

సీఎం, గవర్నర్లకు టీటీడీ  వేదాశీర్వవచనం

నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉండవల్లిలోని నివాసంలో టీటీడీ వేదపండితులు వేదాశీర్వచనం అందజేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు సీఎంకు టీటీడీ డైరీ, క్యాలెండరును అందజేశారు. వేదపండితులు శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం చేశారు. అలాగే, విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు కూడా టీటీడీ వేదపండితులు ఆశీర్వచనం చేశారు. ఈసందర్భంగా ఈవో శ్యామలరావు శ్రీవారి లడ్డూప్రసాదాలు, డైరీ, క్యాలెండర్లు అందించారు.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - Jan 02 , 2025 | 01:39 AM