Share News

ఏం జరిగింది? ఎంత మంది ఉన్నారు?

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:34 AM

ఏం జరిగింది? ప్రమాద సమయంలో లోపల ఎంత మంది ఉన్నారు? ఇదీ పెళ్లకూరు మండలం పెన్నేపల్లిలోని ఎంఎస్‌ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమలో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో తలెత్తుతున్న ప్రశ్నలు.

ఏం జరిగింది? ఎంత మంది ఉన్నారు?
స్టీల్‌ప్లాంటులో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

పెన్నేపల్లి స్టీల్‌ప్లాంట్‌ అగ్ని ప్రమాదంపై అయోమయం

పెళ్లకూరు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ఏం జరిగింది? ప్రమాద సమయంలో లోపల ఎంత మంది ఉన్నారు? ఇదీ పెళ్లకూరు మండలం పెన్నేపల్లిలోని ఎంఎస్‌ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమలో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో తలెత్తుతున్న ప్రశ్నలు. బయట నుంచి సేకరించే వేస్ట్‌ను కరిగించే ఫర్నేస్‌ బాయిలర్‌ పేలడంతో మంటలు చెలరేగాయి. తీవ్రంగా గాయపడిన ఏడుగురు కార్మికుల్లో నాలుగురిని నాయుడుపేట.. ముగ్గురిని నెల్లూరు ఆస్పత్రులకు తరలించారు. వీరంతా బిహార్‌కు చెందిన వారే. గాయపడిన వారిలో రవి బర్వాజ్‌, సోనూ మహమ్మద్‌, విశ్వకర్మ, సి.ముని ప్రస్తుతం నాయుడుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, నైట్‌ షిఫ్టులో 50 మందికిపైగా ఉన్నట్లు చెబుతున్నారు. అసలు ఎంత మంది లోపల పనిచేస్తున్నారు? బయటకు ఎందరు వచ్చారు? ఎంతమందికి గాయాలయ్యాయనే అంశాలపై బుధవారం రాత్రి 12.40 గంటలకూ స్పష్టత లేకపోవడంతో అయోమయం నెలకొంది. ఏడుగురిని మాత్రం ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమాచారం తెలియగానే నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, రూరల్‌ సీఐ సంగమేశ్వరరావు, పెళ్లకూరు ఎస్‌ఐ నాగరాజు, సిబ్బంది.. తహసీల్దారు ద్వారకానాథరెడ్డి, వీఆర్వో రమేష్‌ తదితరులు ప్లాంటు వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడారు.

Updated Date - Jan 02 , 2025 | 01:34 AM