Share News

Empowering Farmers Digitally: మంత్రి కొండపల్లితో డిజిటల్‌ గ్రీన్‌ ప్రతినిధుల భేటీ

ABN , Publish Date - Apr 17 , 2025 | 03:38 AM

డిజిటల్‌ గ్రీన్‌ ప్రతినిధులు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో సమావేశమై, తక్కువ ఖర్చుతో నాణ్యమైన వ్యవసాయ దిగుబడులు సాధించేందుకు సాంకేతికత, డేటా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. మిరప, పసుపు, టమాటా రైతులకు సహాయం చేసే యాప్‌లు అభివృద్ధి చేసినట్లు వివరించారు

Empowering Farmers Digitally: మంత్రి కొండపల్లితో డిజిటల్‌ గ్రీన్‌ ప్రతినిధుల భేటీ

తక్కువ ఖర్చుతో నాణ్యమైన వ్యవసాయ దిగుబడులు సాధిస్తూ, మార్కెటింగ్‌ సదుపాయాలను కల్పిస్తూ అంతర్జాతీయంగా పనిచేస్తున్న డిజిటల్‌ గ్రీన్‌ ప్రతినిధులు బుధవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. సన్న, చిన్నకారు రైతులకు డిజిటల్‌ గ్రీన్‌ ఒక గ్లోబల్‌ అభివృద్ధి సంస్థగా నిలుస్తోందని, సాంకేతిక, డేటా ద్వారా వ్యవసాయదారులు సాధికారత సాధించేలా కృషి చేస్తోందని తెలిపారు. మూడేళ్లుగా రాష్ట్ర ఉద్యానవన శాఖతో కలిసి ఇ-మిర్చి ప్రాజెక్టులో భాగంగా మిరప, పసుపు, టమాటా రైతులకు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు ముఖ్యమైన యాప్‌లు అభివృద్ధి చేశామని వివరించారు. రైతుల కోసం ఏఐ ఆధారిత సలహా ప్లాట్‌ఫారం, రైతు ఉత్పత్తిదారుల సంస్థల సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు మరో యాప్‌ రూపొందించినట్లు పేర్కొన్నారు

Updated Date - Apr 17 , 2025 | 03:38 AM