సముద్రంలో అలవోకగా..
ABN , Publish Date - Jan 04 , 2025 | 01:24 AM
సువిశాల సముద్రం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాలు. సముద్రంలో జెల్లీ ఫిష్‌లు వెంటపడి కొరుకుతున్నా.. భయంకరమైన వే ల్ ఫిష్ దాడికి ప్రయత్నించినా సప్త సముద్రం, బంగాళాఖాతంలో 150కిలోమీటర్ల మేర సముద్రంలో ఈత లక్ష్యాన్ని పూర్తిచేయాలన్న సంకల్పం ముందు అవరోధాలు ఏమీ కానరాలేదు.
వైజాగ్ నుంచి కాకినాడకు ఈదుకుంటూ..
అవలీలగా ఆరు రోజుల్లో 150 కిలోమీటర్ల ఈత
ఆసియాలోనే తొలి మహిళా స్విమ్మర్‌గా రికార్డు
మహిళా స్విమ్మర్ గోలి శ్యామలకు ఘనస్వాగతం
సర్పవరంజంక్షన్, జనవరి 3(ఆంధ్రజ్యోతి): సువిశాల సముద్రం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాలు. సముద్రంలో జెల్లీ ఫిష్‌లు వెంటపడి కొరుకుతున్నా.. భయంకరమైన వే ల్ ఫిష్ దాడికి ప్రయత్నించినా సప్త సముద్రం, బంగాళాఖాతంలో 150కిలోమీటర్ల మేర సముద్రంలో ఈత లక్ష్యాన్ని పూర్తిచేయాలన్న సంకల్పం ముందు అవరోధాలు ఏమీ కానరాలేదు. కేవలం 6 రోజుల్లో రోజుకు 20-30కిలోమీటర్లు సముద్రంలో ఈత కొట్టి వైజాగ్ నుంచి కాకినాడ ఎన్టీఆర్ బీచ్‌కు సముద్రంలో 150 కిలోమీటర్ల లక్ష్యాన్ని అవలీలగా ఈదేసి అరుదైన రికార్డును సొంతంచేసుకున్నారామె. ఆమె కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన 52ఏళ్ల మహిళా స్విమ్మర్ గోలి శ్యామల.
యానిమేషన్ సినిమాల నిర్మాత, దర్శకురా లిగా, రచయితగా, పలు బిజినెస్‌లు చేసి న ష్టపోయి డిప్రెషన్‌కు లో నై కోమాలోకి కూడా వెళ్లి న ఆమె ఇప్పుడు అంతర్జాతీయ వాటర్ స్విమ్మర్‌గా రికార్డులను తనపేరున లిఖించుకున్నారు.మహిళ ల ఆరోగ్య, మానసిక సమస్యలనుంచి ఆరోగ్యంగా ఉండేలా, పర్యాటకరంగం అభివృద్ధి కోసం శ్యామల విశాఖ ఆర్కే బీచ్ నుంచి కాకినాడ ఎన్టీఆర్ బీచ్‌వరకు 150కిలోమీటర్లు స ముద్రంలో ఈత ఈది రి కార్డు సృష్టించాలని నిర్ణ యించుకుంది. డిసెంబరు 28న విశాఖ ఆర్కే బీచ్‌లో ఎంపీ భరత్ సముద్రంలో సాహస యాత్రకు జెండా ఊపి ప్రారంభించారు. విశా ఖతీరంనుంచి సముద్రంలో ఈత ఈదుకుం టూ శుక్రవారం జనవరి 3న కాకినాడ ఎన్టీ ఆర్ బీచ్‌కు అవలీలగా లక్ష్యాన్ని చేరుకున్నా రు. సుదీర్ఘ సముద్రంలో 150కిలోమీటర్లు ఈ త ఈదిన తొలి ఆసియా స్విమ్మర్‌గా శ్యామ ల అరుదైన రికార్డు సాధించారు. ఎన్టీఆర్ బీచ్‌కు చేరుకున్న ఆమెకు కోరమండల్ ఓడిస్సీ ఓషియన్ స్విమ్మింగ్, కాకినాడ సీపోర్టు ప్రైవేట్ లిమిడెట్ ప్రతినిధులు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన ఘన స్వాగతం పలికారు.
మహిళల్లో చైతన్యం.. ఆరోగ్య సంరక్షణకు..
అభినందనసభలో మహిళా స్విమ్మర్ గోలి శ్యామల మాట్లాడుతూ మహిళల్లో చైతన్యం ఆరోగ్య సంరక్షణ, పర్యాటక రంగం అభివృద్ధికి సముద్రంలో ఈతను నేర్చుకున్నామన్నారు. శ్రీలంకనుంచి రామసేతు వరకు, లక్షద్వీప్ స ముద్రంలో ఈతఈది పలు రికార్డులు సాధిం చానన్నారు. అమెరికాలో జరిగిన ఈత పోటీ ల్లో 36కిలోమీటర్ల కాటలినా ఛానల్‌ని ఈదా నన్నారు. ఓ ఆంగ్ల పత్రికలో ఇంగ్లీష్ ఛానల్ ఈదిన వ్యక్తి కథనం ఈత వైపు వెళ్లేలా చే సిందని, లక్షద్వీప్‌లో జరిగిన పర్యాటక అభి వృద్ధిలో పాల్గొనేందుకు విచ్చేసిన ప్రధాని మోదీ చేసిన ప్రచారం నాలో స్ఫూర్తిని నిం పిందన్నారు. లక్ష్యసాధనకు కృషిచేయాలని, ప్రతిఒక్కరూ ఈత నేర్చుకోవడం ద్వారా తలవెంట్రుక నుంచి శరీరంలో ఉన్న అన్ని భాగాలకు పూర్తి వ్యాయామం చేసినట్లు అవుతుందన్నారు. ప్రపంచంలోనే నాలుగో అంతర్జాతీ య స్విమ్మర్‌గా, దేశంలో నేనే నెంబర్‌వన్‌గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. కోచ్‌జాన్ సివిక్ పర్యవేక్షణలో హైదరాబాద్‌లో తాను జాయింట్ స్పోర్ట్స్ నేర్చుకున్నానన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఎదురవుతాయని, అలాంటి సమయంలో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుందామని భావించకుండా మైండ్ డైవర్షన్ చేసుకోవడం ద్వారా ఒత్తిడినుంచి బ యట పడవచ్చన్నారు. ఎమ్మెల్యే రాజప్ప, రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ వైడీ రామారావు,కాకినాడ సీపోర్టు ప్రైవేట్ లిమిటెడ్ జీఎం మురళీధర్, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.