Share News

ఆనందోత్సాహాలతో భోగి

ABN , Publish Date - Jan 14 , 2025 | 12:27 AM

సంక్రాంతి పండుగ తొలిరోజు భోగిని ప్రజలు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.

  ఆనందోత్సాహాలతో భోగి

ముమ్మిడివరం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ తొలిరోజు భోగిని ప్రజలు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే స్నానాలు ఆచరించి నూతన దుస్తులు ధరించి గ్రామాల్లోని నాలుగు వీధుల కూడళ్లలో పెద్దపెద్ద భోగిమంటలు వేసి వాటిలో భోగి దండలు వేసి పండుగ జరుపుకున్నారు. పుట్టింటి ఆడపడుచులు, అల్లుళ్ల రాకతో గ్రామాల్లో సందడి నెలకొంది. చిన్నారులు గాలిపటాలు ఎగురవేశారు. చిన్నారులకు భోగి పండ్లను వేసి బొమ్మలకొలువును తీర్చిదిద్దారు. ఇళ్ల ముందు రంగవల్లికలు వేసి ఆకట్టుకున్నారు.

Updated Date - Jan 14 , 2025 | 12:27 AM