Share News

ముగిసిన బాడీబిల్డింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు

ABN , Publish Date - Jan 14 , 2025 | 12:31 AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాస్థాయి బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు ముగిశాయి. అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో కోనసీమ బాడి బిల్డింగ్‌ అసోసియేషన్‌, హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌ సంయుక్త ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు అధ్యక్షతన జరిగిన పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఎం.పోలయ్య, బి.కృష్ణ, బి.ప్రకాష్‌, డీవీ రమణ, వై.శ్రీనివాసరావు, ఎంవీ సముద్రం వ్యవహరించారు.

ముగిసిన బాడీబిల్డింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు

అమలాపురంటౌన్‌, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాస్థాయి బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు ముగిశాయి. అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో కోనసీమ బాడి బిల్డింగ్‌ అసోసియేషన్‌, హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌ సంయుక్త ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు అధ్యక్షతన జరిగిన పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఎం.పోలయ్య, బి.కృష్ణ, బి.ప్రకాష్‌, డీవీ రమణ, వై.శ్రీనివాసరావు, ఎంవీ సముద్రం వ్యవహరించారు. పోటీల విజేతల వివరాలను జిమ్‌ కోచ్‌ కంకిపాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. 70కిలోలవిభాగంలో పి.బాలరాజు (కాకినాడ జిల్లా), 75కిలోల విభాగంలో పి.శివగణేష్‌ (కోనసీమ జిల్లా), 75కిలోల పైబడిన విభాగంలో జి.హేమంత్‌కుమార్‌ (కాకినాడ జిల్లా)లు విన్నర్స్‌గా నిలిచారు. మాస్టర్స్‌ విభాగంలో బి.శంకర్‌ (కాకినాడ జిల్లా), దివ్యాంగ విభాగంలో జి.మోషే (కోనసీమ జిల్లా), 165 బిలో ఫిజిక్‌ స్పోర్ట్స్‌ విభాగంలో పి.బాలరాజు (కాకినాడ జిల్లా), 165 పైబడిన ఫిజిక్‌ స్పోర్ట్స్‌ విభాగంలో సీహెచ్‌ ఇళయరాజా (కాకినాడ జిల్లా) ప్రథమ స్థానాలు సాధించారు. బాడీ బిల్డింగ్‌ టైటిల్‌ విన్నర్‌గా కాకినాడ జిల్లాకు చెందిన ఎం.దుర్గాప్రసాద్‌, రన్నర్‌గా జి.హేమంత్‌కుమార్‌ నిలిచారు. ఫిజిక్స్‌ స్పోర్ట్స్‌ టైటిల్‌ విన్నర్‌గా సీహెచ్‌ ఇళయరాజా, రన్నర్‌గా పి.బాలరాజు నిలిచారు. ఆయా విజేతలకు పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యెనుముల కృష్ణపద్మరాజు, పోటీల ఆర్గనైజర్‌ ఆశెట్టి ఆదిబాబు, గౌరవాధ్యక్షుడు నగభేరి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్‌, ముత్తాబత్తుల వెంకటరమణ షీల్డులు, సర్టిఫికెట్లు అందజేశారు.

Updated Date - Jan 14 , 2025 | 12:31 AM