యథేచ్ఛగా కోడిపందాలు
ABN , Publish Date - Jan 14 , 2025 | 12:29 AM
గతంలో ఎన్నడూ లేని విధంగా మండలంలో ఎక్కడపడితే అక్కడ కోడిపందాలు, గుండాటలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
అమలాపురం రూరల్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): గతంలో ఎన్నడూ లేని విధంగా మండలంలో ఎక్కడపడితే అక్కడ కోడిపందాలు, గుండాటలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అమలాపురం పట్టణంలోని ఈదరపల్లి బైపాస్ రోడ్డులో నాలుగు గుండాట బోర్డులు ఏర్పాటు చేయగా రెండు బోర్డులు ఖాళీగా మిగిలిపోయాయి. వాసర్ల గార్డెన్స్ సమీపంలో ఏర్పాటుచేసిన కోడిపందాల బరి వద్ద జనం లేక వెలవెలబోయింది. సంక్రాంతి పెద్ద పండుగ రోజు నుంచి ఊపందుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక రోళ్లపాలెం, కామనగరువు, సమనస, సవరప్పాలెం, ఇందుపల్లి, పేరూరు తదితర గ్రామాల్లో కోడిపందాల బరులు ఏర్పాటు చేశారు. రెండు, మూడు చోట్ల మినహా మిగిలిన పందాల బరుల వద్ద పందెపు రాయుళ్లు అధిక సంఖ్యలో తరలివచ్చారు.