ప్రాచీన సంస్కృతి పరిరక్షణకు కృషి చేద్దాం
ABN , Publish Date - Jan 14 , 2025 | 12:55 AM
ప్రాచీన సంస్కృతి పరిరక్షణ బాధ్యత అందరిపై ఉం దని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.
ఆలమూరు, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ప్రాచీన సంస్కృతి పరిరక్షణ బాధ్యత అందరిపై ఉం దని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు అయ్యప్పస్వామి ఆలయం వద్ద ప్రాచీన సంప్రదాయాలను పరిరక్షించడంలో ఆలయ కమిటీ కృషిని అభినందించారు. ఆలయ కమిటీ నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆయన బహుమతులు అందించారు. కార్యక్రమంలో టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆఫీసర్ పి.ఆనందతీర్ధాచార్యులు, అయ్యప్పస్వామి ఆలయ కమిటీ వ్యవస్థాపకుడు పి.ముకుందేశ్వరస్వామి, సర్పంచ్ నాతి లావణ్య, నాయకులు వంక అన్నవరం, వంటిపల్లి పాపారావు, వైట్ల దుర్గారావు, రావాడ సత్తిబాబు, గన్ని వెంకన్నబాబు, అల్లంరాజు రామకృష్ణమూర్తి, కెఎస్‌ఎస్ శర్మ తదితరులను ఆనందతీర్థ్ధాచార్యులు సత్కరించారు.
ఆలయ కమిటీ చైర్మన్‌గా వంటిపల్లి: అయ్యప్పస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా వంటిపల్లి సతీష్‌కుమార్‌ను ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన్ను టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆఫీసర్ ఆనందతీర్థాచార్యులు, ఎమ్మెల్యేతోపాటు, నాయకులు అభినందించారు.
చిన్నతనం నుంచే నేర్పాలి: చిన్నప్పటి నుంచే విలువలతో పిల్లలను పెంచడం వల్ల వారిలో జాలి, దయాగుణం అలవడుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) దాససాహిత్య ప్రాజెక్టు ఆఫీసర్ పి.ఆనందతీర్థాచార్యులు అన్నారు. ఆలమూరు అయ్యప్పస్వామి ఆలయం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన ఆఽధ్యాత్మిక సభలో ఆయన మాట్లాడారు. సనాతన ధర్మాన్ని అలవాటు చేయడం ద్వారా ఉత్తమ పౌరులుగా తయారవుతారని అన్నారు.
నేడు మకరజ్యోతి దర్శనానికి ఏర్పాట్లు: అయ్యప్పస్వామి మకరజ్యోతి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి సాయంత్రం 6.45 గంటలకు మకరజ్యోతి దర్శనం జరిగేలా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 2గంటల నుంచి గ్రామంలో వందలాది మంది బాలికలచే జ్యోతులతో స్వామి ఆభరణాలను డోలుసన్నాయి, కేరళ వాయిద్యాలతో ఊరేగింపు జరుతుందని ఆలయ వ్యవస్థాపకులు ముకుందేశ్వరస్వామి, అభివృద్ధి కమిటీ చైర్మన్ సతీష్‌కుమార్ తెలిపారు. అనంతరం ఆలయ ప్రాగణంలో మకరజ్యోతి దర్శనం, ఏడుగంటలకు ఆలయా నికి పక్కనే ఉన్న చెరువులో తెప్పొత్సవం, బాణసంచా కాల్పులు నిర్వహించనున్నట్లు చెప్పా రు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేయనున్నారు.