Share News

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jan 08 , 2025 | 01:15 AM

రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా తీసుకునే ముందస్తు చర్యల గురించి చర్చించేందుకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయశ్రీనివాస్‌ ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

  రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

ఎస్పీని కోరిన ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్‌

కాకినాడ క్రైం, జనవరి 7(ఆంధ్రజ్యోతి): రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా తీసుకునే ముందస్తు చర్యల గురించి చర్చించేందుకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయశ్రీనివాస్‌ ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పండుగ నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించడంతోపాటు రోడ్డు ప్రమాదా ల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ముఖ్యంగా విస్తరణ పనులు చేపడుతున్న సామర్లకోట కాకినాడ ఏడీబీ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయ డంతోపాటు రాత్రి సమయాల్లో లైటింగ్‌ లేని ప్రదేశాల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేయాల న్నారు. అలాగే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు విస్తృతంగా చేయాలని ఎంపీ కోరారు.

Updated Date - Jan 08 , 2025 | 01:15 AM