Share News

కేరళ తరహాలో....

ABN , Publish Date - Jan 13 , 2025 | 01:11 AM

ఆత్రేయపురం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన కెనాల్‌లో సర్‌ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాల్లో భాగంగా కేరళ తరహాలో డ్రాగన్‌ పోటీలు రసవత్తరంగా సాగాయి. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ట్రోఫి పోటీలు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆత్రేయపురం ప్రధాన కాలువలో రెండో రోజు ఆదివారం నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. కేరళను తలపించేలా డ్రాగన్‌ పడవ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి 11 టీమ్‌లు 121 మంది పడవ పోటీలలో

కేరళ తరహాలో....
ఆత్రేయపురంలో నిర్వహించిన డ్రాగన్‌ పడవ పోటీలు

ఆత్రేయపురంలో సర్‌ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి

ట్రోఫీలో భాగంగా డ్రాగన్‌ పడవ పోటీలు

తిలకించిన ఎమ్మెల్యేలు, రుడా చైర్మన్‌

ఆత్రేయపురం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన కెనాల్‌లో సర్‌ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాల్లో భాగంగా కేరళ తరహాలో డ్రాగన్‌ పోటీలు రసవత్తరంగా సాగాయి. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ట్రోఫి పోటీలు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆత్రేయపురం ప్రధాన కాలువలో రెండో రోజు ఆదివారం నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. కేరళను తలపించేలా డ్రాగన్‌ పడవ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి 11 టీమ్‌లు 121 మంది పడవ పోటీలలో పాల్గొన్నారు. ఆత్రేయపురం నుంచి ఉచ్చిలి వరకు ప్రధాన కాలువకు ఇరువైపులా జనసందోహం పోటీలను తిలకించారు. కేరళ వాయిద్యాలు, ఎల్‌ఈడీ స్ర్కీన్ల ద్వారా పోటీలను ఉత్సాహభరితంగా వీక్షించారు. ఎమ్మెల్యే బండారుతో పాటు రాజోలు ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, రాజమహేంద్రవరం రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణచౌదరిలు పడవ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. డ్రాగన్‌ పడవ పోటీలతో పాటు కాయాకింగ్‌, కెనాయింగ్‌, పారాకయ్య పడవ పోటీలు రసవత్తంగా సాగాయి. దివ్యాంగులు సైతం ఈ పోటీల్లో పాల్గొనడం విశేషం. పోటీల్లో జంగారెడ్డిగూడెం జెయింట్‌, పల్నాడు తండర్స్‌, ఎన్టీఆర్‌ ఈగల్స్‌, కోటిపల్లి సీతాష్‌, పల్నాడు పాంథర్స్‌, కృష్ణ లయన్స్‌ సెమిఫైనల్స్‌కు చేరుకున్నాయి. సోమవారం ఫైనల్స్‌ పోటీల్లో భాగంగా విజేతలను ఫ్రైజ్‌మనీ, జ్ఞాపికలతో సత్కరించనున్నారు. ఈ ట్రోఫిలో భాగంగా ఎమ్మెల్యే బండారుపై అభిమానంతో రాచకొండ శ్రీనివాస్‌ క్రియేట్‌ చేసిన పాట సీడీని ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, కరుటూరి నరసింహరావు, ముదునూరి వెంకట్రాజు, ముళ్ళపూడి భాస్కరరావు, ముత్యాల బాబ్జి, కంఠంశెట్టి శ్రీనివాస్‌, విక్టరీ అధినేత గొలుగూరి వెంకటరెడ్డి, సీఆర్సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, తహశీల్దారు రాజేశ్వరరావు, ఎంపీడీవో వెంకటరామన్‌, వివిధ శాఖాధికారులు ఉన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 01:11 AM