Share News

వందేళ్ల తర్వాత ఎండోమెంట్‌ భూమి స్వాధీనం

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:43 AM

వందేళ్ల తరువాత ఎండోమెంట్‌ అధికారులు దేవాదాయ భూమిని స్వాధీనం చేసు కున్నారు.

వందేళ్ల తర్వాత ఎండోమెంట్‌ భూమి స్వాధీనం
భూమిని స్వాధీనం చేసుకున్న ఎండోమెంట్‌ అధికారులు

రూ. 78 లక్షల శిస్తు బకాయిపడిన రైతు

రాజానగరం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : వందేళ్ల తరువాత ఎండోమెంట్‌ అధికారులు దేవాదాయ భూమిని స్వాధీనం చేసు కున్నారు. రాజానగరం మండలం తూర్పుగోనగూడెం గ్రామ పరి ధిలో జాతీయ రహదారిని ఆనుకుని దేవాదాయ ధర్మాదాయశాఖ అధీనంలోని శ్రీరాజా కాండ్రేగుల జోగి జగన్నాథరావు పంతులు బహద్దూర్‌ వారి అన్నదాన సత్రానికి సంబంధించి సర్వే నెంబరు 20,27,28,135లలో 25.16 ఎకరాలు భూమి ఉంది.ఆ పొలాన్ని రాజానగరానికి చెందిన ముత్యాల సత్యనారాయణ కుటుంబీకులు వందేళ్లుగా కౌలు వ్యవసాయం చేస్తున్నారు. నామమాత్రపు లీజు లు చెల్లించకపోవడంతో ఇప్పటి వరకు రూ.78 లక్షలు బకాయిలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. లీజు బకాయిలు చెల్లించా లంటూ అధికారులు ఎన్నిమార్లు నోటీసులు జారీ చేసినా ఖాతరు చేయకుండా కోర్టులను ఆశ్రయిస్తూ సదరు భూమిపై వస్తున్న లక్షలాది రూపాయల ఆదాయాన్ని అన్యాయంగా దోచుకుంటు న్నారని అధికారులు చెప్పారు. ఈ మేరకు అధికారులు, పోలీసుల సమక్షంలో జిల్లా దేవదాయశాఖాధికారి కె.నాగేశ్వరరావు శుక్ర వారం సదరు భూమిని గ్రామ పెద్దలు సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తనిఖీదారు టీటీఎస్‌ఆర్‌.ప్రసాద్‌, అన్నదాన సత్రం కార్యనిర్వహణాఽధికారులు డి.సురేష్‌బాబు, రాం బాబు రెడ్డి, ఎండోమెంట్‌ అధికారులు,రాజానగరం ఎస్‌ఐ మనోహర్‌, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.

అన్నదాన సత్రానికి 147 ఎకరాల భూమి

శ్రీరాజా కాండ్రేగుల జోగి జగన్నాథరావు పంతులు బహద్దూర్‌ వారి అన్నదాన సత్రానికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో 147 ఎకరాలు విలువైన పంట భూములు ఉన్నాయి. లీజు సొమ్ములు ఎగవేస్తున్న వారి నుంచి వీలైనంత త్వరలోనే స్వాధీనం చేసుకుంటాం. - నాగేశ్వరరావు, జిల్లా దేవదాయశాఖాధికారి

Updated Date - Jan 11 , 2025 | 12:43 AM