Share News

ఫుల్‌గా తాగారు

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:01 AM

పాత సంవత్సరానికి వీడ్కోలు.. కొత్త ఏడాదికి స్వాగతం పేరుతో తాగేవాళ్లు బాగానే తాగారు. డబ్బు లేనివాళ్లు తగ్గించారు... కొందరు సారా తోనూ, కల్లుతోనూ సరిపెట్టుకున్నారు.

 ఫుల్‌గా తాగారు

జిల్లాలో రెండు డిపోల పరిధిలో రూ.23 కోట్ల

గతంకంటే తగ్గిందనే వాదన

డిసెంబరు నెలలో రూ.183 కోట్లు

అయినా ముభావంగా వ్యాపారులు

(రాజమహేంద్రవరం - ఆంరఽధజ్యోతి)

పాత సంవత్సరానికి వీడ్కోలు.. కొత్త ఏడాదికి స్వాగతం పేరుతో తాగేవాళ్లు బాగానే తాగారు. డబ్బు లేనివాళ్లు తగ్గించారు... కొందరు సారా తోనూ, కల్లుతోనూ సరిపెట్టుకున్నారు. అయినా ప్రతీ ఏటా మాదిరిగా ఈ ఏడు కూడా మద్యం ఏరులైపారింది. కానీ గతంలో అంతంగా అమ్మ కాలు లేవని మద్యం వ్యాపారులు చెప్పడం గమనార్హం. జిల్లాలో 125 మద్యం దుకాణాలు, 21 బార్లు ఉన్నాయి. రాజమహేంద్రవరం, చాగ ల్లు మండలం పరిధిలో ఎక్జైజ్‌ డిపోలు ఉన్నా యి. ఈ రెండు డిపోల పరిధి నుంచి డిసెంబర్‌ 30, 31 తేదీల్లో సుమారు రూ.23 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబరు నెల మొత్తం రూ.183 కోట్లు విక్రయాలు జరిగాయి. అయినా మద్యం వ్యాపారులు ముభావంగానే ఉన్నారు. సాధారణంగా ప్రతీ రోజూ జిల్లాలో జిల్లాలోని 125 మద్యం దుకాణాలు, 21 బార్లల ద్వారా సుమారు 8 నుంచి 9 కోట్ల వరకూ అమ్మకాలు ఉంటాయి. డిసెంబర్‌ 30, 31 తేదీల్లో పాత సం వత్సరం వెళ్లిపోతోందనే బాధతో గత అనుభ వాలను నెమరవేసుకుంటూ, కొత్త సంత్సరానికి స్వాగతం పలుకుతూ డిసెంబర్‌ 31వ తేదీ తెల్లవారూ అనేకమంది ఎంజాయ్‌ చేస్తారు. ఇందులో మద్యం వినియోగమే ఎక్కువ. రాజ మహేంద్రవరం వంటి నగరాల్లో పబ్‌లు, హోట ళ్లు కిటకిటలాడాయి. తెల్లవారూ సందడే సం దడి.. తాగేవాళ్లు తాగినంత తాగారు. న్యూ ఇయర్‌కి రాజమహేంద్రవరం డిపో నుంచి రూ. 12 కోట్ల సరుకు షాపులకు వచ్చింది. ఇది రాజమండ్రి డివిజన్‌లోని దుకాణాలతోపాటు ఏజెన్సీకి కొంత, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని కొన్ని షాపులకు సరుకు వెళ్లింది. చాగల్లులోని మీనానగర్‌ డిపో నుంచి రూ.11 కోట్ల సరుకు షాపులకు వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో ని కొన్ని షాపులకు కూడా వెళ్లింది. అందువల్ల ఈ సరుకు అంతా జిల్లాలోనే తాగినట్టు కాదని అధికారులు చెబుతున్నారు. కానీ బెల్ట్‌ షాపులు బాగా పెరగడం వల్ల ముందుగా కొనుగోలు చేసిన సరుకు కూడా అమ్మకాలు జరిగినట్టు ప్రచారం ఉంది. జిల్లాలో బెల్ట్‌ షాపులు బాగా పెరిగాయి. ఇక జిల్లాలో కొన్ని షాపుల్లో అమ్మ కాలు జోరుగా సాగాయి. కొన్ని దుకాణాల్లో మాత్రం అమ్మకాలు డల్‌గా ఉన్నట్టు అధికారు లు కూడా చెబుతున్నారు. రాజమహేంద్రవరం పరిధిలో ఏసీ గార్డెన్స్‌లోని దుకాణంలో మొద టినుంచి అమ్మకాలు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఒకటే షాపు ఉంది. మండలం యూని ట్‌గా అనుమతి ఇవ్వడంతో ఎవరికి ఇష్టమైన చోట వాళ్లు దుకాణాలు పెట్టుకోవడంతో కూడా ఈ పరిస్థితి ఉన్నట్టు చెబుతున్నారు. లాలా చెరువులో ఏకంగా నాలుగు షాపులు దగ్గరలో పెట్టేయడం గమనార్హం. గతంలో వ్యాపారు లంతా సిండికేట్‌ అయ్యేవారు. ఈసారి ఇంకా పూర్తిస్థాయిలో సిండికేట్‌ కాలేదని చెబుతున్నా రు. పైగా ఈసారి రాజకీయ నేతలు కూడా ఈ వ్యాపారంలో ఉండడంతో కూడా సిండికేట్‌కు కొంత ఇబ్బందిగా ఉన్నట్టు కూడా ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లోనే కొందరు బాగా అమ్ముకుంటుంటే, కొందరు డల్‌గా ఉందని చెబుతున్నారు.

20 శాతం కమీషన్‌ బెంగ

మద్యం వ్యాపారుల్లో 20శాతం కమీషన్‌ రాక పోవడంతో బెంగ పెట్టుకున్నారు. సాధారణంగా బెంగ ఉన్నవాళ్లు లిక్కర్‌ తాగుతుంటారు. లిక్కర్‌ వ్యాపారులే బెంగ పెట్టుకుంటే ఇంకెవరికి చెప్పా లి. ప్రభుత్వం మొదట్లో 20 శాతం కమిషన్‌ ఇస్తానని హామీ ఇచ్చింది. కానీ ఇటీవల కేవలం 9నుంచి 10శాతం వరకే కమీషన్‌ ఇస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు కమీషన్‌ ఇస్తే, ఈసారి అమ్మకాల్లో కూడా లాభాలు కనిపించేవి. వారు ఆనందంగా ఉండేవారు. కానీ ఇవాళ నూతన సంవత్సరానికి స్వాగతం, పాత సంవత్సరానికి వీడ్కోలు పేరిట గత నెల 30,31 తేదీల్లో సరు కుతోపాటు బుధవారం సుమారు రూ.8 కోట్ల వరకూ తాగినట్టు చెబుతున్నారు. అంటే ఈ మూడు రోజుల్లో సుమారు రూ.31 కోట్ల వరకూ అమ్ముడైనట్టు అంచనా. ఇందులో వ్యాపారులకు 20శాతం కమీషన్‌ ఉంటే ఆనందంగా ఉండే వారు. కానీ ఎక్కువ ఆదాయం రాష్ట్ర ప్రభు త్వానికి వెళ్లింది. వ్యాపారులు, ప్రభుత్వమూ ఎలా ఉన్నా మద్యం బాబులు మాత్రం ఏటా మాదిరిగా ఈ ఏడు కూడా ఫుల్‌గా తాగి, జేబులు, ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకున్నారు.

Updated Date - Jan 02 , 2025 | 01:01 AM