నేడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:45 AM
కడియం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రౌండ్‌లో శని వారం జరిగే గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హైదరాబాదుకు చెందిన ఈవెంట్ నిర్వాహకులు వేదికను సిద్ధం చేస్తున్నారు. సభా వేదిక వద్ద ట్రాఫిక్ విధానాలను పరిశీలించ
కడియం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రౌండ్‌లో శని వారం జరిగే గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హైదరాబాదుకు చెందిన ఈవెంట్ నిర్వాహకులు వేదికను సిద్ధం చేస్తున్నారు. సభా వేదిక వద్ద ట్రాఫిక్ విధానాలను పరిశీలించడానికి జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్, ఏఎస్పీలు ఏబీఎన్ మురళీకృష్ణ, సుబ్బరాజు, డీఎస్పీలు భవ్యకిషోర్, దేవకుమార్, రమేష్, పలు స్టేషన్ల సీఐలు, ఎస్ ఐలతో సమావేశం నిర్వహించారు. లక్ష మంది పైగా మెగా అభిమానులు ఈ ఈవెంట్‌ను తిలకించడానికి వస్తారని అంచనా. డిప్యూటీ సీ ఎం పవన్‌కల్యాణ్, దర్శకులు శంకర్, సినిమా యూనిట్ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ఆలిండియా చిరంజీవి ఫాన్స్ అధ్యక్షుడు రవణం స్వామినాయుడు, చిరంజీవి అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడిద బాబి, మెగా అభిమానులు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.