బాలికల సంరక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Jan 08 , 2025 | 12:39 AM
బాలికలు, మహిళలను రక్షించుకునే బాధ్యత మనంద రిపై ఉందని కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్ అన్నారు. కొవ్వూరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మున్సిపాల్టీ పరిధిలోని సచివాలయ సెక్రటరీలు, అంగ న్వాడీ కార్యకర్తలకు కిశోరి వికాసంపై ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు.
కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ నాగేంద్రకుమార్
కిశోరి వికాసంపై శిక్షణా తరగతులు
కొవ్వూరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): బాలికలు, మహిళలను రక్షించుకునే బాధ్యత మనంద రిపై ఉందని కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్ అన్నారు. కొవ్వూరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మున్సిపాల్టీ పరిధిలోని సచివాలయ సెక్రటరీలు, అంగ న్వాడీ కార్యకర్తలకు కిశోరి వికాసంపై ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు. కౌమార దశలో బాలికలు ఎదుర్కొనే సమస్యలు, సంక్షేమం, రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఆడపిల్లలను కా పాడుకోవాలని, చదివించుకోవాలన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారని, డ్వా క్రా సంఘాలను ఏర్పాటుచేసి మహిళలను ప్రో త్సహిస్తున్నట్టు చెప్పారు. ఎంపీడీవో కె.సుశీల మాట్లాడుతూ కిశోరి వికాసంపై శిక్షణ పొందిన సిబ్బంది వారి సచివాలయాల పరిధిలో ఉన్న 11నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న బాలికలకు కౌమార దశలో తీసుకోవలసిన జా గ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. అనంత రం టీవోటీలు బాల్య వివాహాల నిర్మూలన, చైల్డ్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలు, మొబైల్ యాప్‌లు, ఇన్‌స్ట్రాగ్రామ్‌కు అలవాటు పడి పిల్లలు ఏవిధంగా మోసపోతున్నారో వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లను తెలియజేశారు. కార్యక్రమంలో సీఐ పి.విశ్వం, ఐసీడీఎస్ సీడీపీవో డి.మమ్మీ తదితరులు పాల్గొన్నారు.