Share News

వైభవంగా లక్షతులసి పూజ

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:18 AM

ధనుర్మాసం సందర్భంగా నూతన సంవత్స రాన్ని పురస్కరించుకుని చింతలూరు నూకాంబికా అమ్మవారి ఆలయంలో లక్షతులసి పూజ నిర్వహించారు.

వైభవంగా లక్షతులసి పూజ

ఆలమూరు, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ధనుర్మాసం సందర్భంగా నూతన సంవత్స రాన్ని పురస్కరించుకుని చింతలూరు నూకాంబికా అమ్మవారి ఆలయంలో లక్షతులసి పూజ నిర్వహించారు. ఆలయ నిర్వహకులు ద్విభాష్యం కాశీవిశ్వనాధశర్మ, అల్లంరాజు భరణీల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన లక్షతులసి పూజను అర్చకస్వాములు శాస్త్రోక్తంగా జరిపించారు. ముందుగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం తులసి దళాలతో లక్షతులసి పూజను చేశారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

Updated Date - Jan 02 , 2025 | 01:18 AM