సింహ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:11 AM
తూర్పు తిరుమల గా పేరొందిన బలభద్రపురం శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామి ద్వితీయ బ్రహ్మోత్సవాలు బుధవారం తొమ్మిదవ రోజుకు చేరాయి. ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభించి సహస్ర కలశాభిషేకం, సుగంధ పుష్పాభిషేకం, మార్గ శీర్ష వ్రతం కార్యక్రమాలు జరిపారు.
బిక్కవోలు, జనవరి 1(ఆంధ్రజ్యోతి): తూర్పు తిరుమల గా పేరొందిన బలభద్రపురం శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామి ద్వితీయ బ్రహ్మోత్సవాలు బుధవారం తొమ్మిదవ రోజుకు చేరాయి. ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభించి సహస్ర కలశాభిషేకం, సుగంధ పుష్పాభిషేకం, మార్గ శీర్ష వ్రతం కార్యక్రమాలు జరిపారు. రాత్రి గోవింద నామ స్మరణల మధ్య సింహ వాహనంపై శ్రీమలయ్యప్పస్వామి అవతారంలో స్వామి అమ్మవార్లను మాడ వీధుల్లో ఊరేగించారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ చైర్మన్ మల్లిడి గంగారెడ్డి అన్న ప్రసాదాన్ని ఏర్పాటుచేశారు. ఈ బ్రహ్మో త్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.