Share News

లక్ష్య సాధనకు కష్టపడండి

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:57 AM

గండేపల్లి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): మీ గోల్‌ నిర్ణయించుకోండి దాని కోసమే కష్టపడండి... ఆలోచించండి.. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా రీచ్‌ అవ్వండి అని సినీ నటుడు కిరణ్‌ అబ్బవరం పేర్కొన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య యూనివర్శిటీలో నిర్వహిస్తున్న కలర్స్‌ ఫెస్ట్‌ యువ

లక్ష్య సాధనకు కష్టపడండి
మాట్లాడుతున్న కిరణ్‌ అబ్బవరం

సినీ హీరో కిరణ్‌ అబ్బవరం

గండేపల్లి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): మీ గోల్‌ నిర్ణయించుకోండి దాని కోసమే కష్టపడండి... ఆలోచించండి.. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా రీచ్‌ అవ్వండి అని సినీ నటుడు కిరణ్‌ అబ్బవరం పేర్కొన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య యూనివర్శిటీలో నిర్వహిస్తున్న కలర్స్‌ ఫెస్ట్‌ యువజనోత్సవాల్లో భాగంగా మూడోరోజు శనివారం జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. దీంతో విద్యార్థులు ఉత్సాహంగా కేరింతలు కొ ట్టారు. కిరణ్‌ మాట్లాడుతూ నేను హీరో అవుతానంటే అందరూ నవ్వారు అది పట్టించుకోకుం డా ప్రయత్నం చేశాను ఇప్పుడు హీరోగా మీ ముందు ఉన్నాను. పాజిటివ్‌గా ఆలోచించాలని కోరారు. కిరణ్‌ను ఆదిత్య యాజమాన్యం శేషారెడ్డి, సతీష్‌రెడ్డి ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ కూడా పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 12:57 AM