ప్రతి మంగళవారం స్పెషల్‌డ్రైవ్
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:22 AM
అన్నవరం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ పర్యటించారు. సత్యదేవుని దర్శించిన అనంతరం నిత్యకల్యాణమండపం వద్ద నున్న మరుగుదొడ్లను పరిశీలించారు. అపరిశుభ్ర వాతావరణంపై అసహనం వ్యక్తం చేశారు. స్వామివారి కల్యాణకట్ట వద్ద పరిసరాల అపరిశుభ్రతను గమనించి ప్రతి మంగళవారం స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలని, పరిసరాల పరిశుభ్రత

అన్నవరం దేవస్థానంలో
కాకినాడ జిల్లా కలెక్టర్ పరిశీలన
అపరిశుభ్ర వాతావరణంపై అసహనం
పంపా రిజర్వాయర్‌లో
నీటి అంశంపై అధికారులతో చర్చ
సత్యనికేతన్ సత్రం ఘటనపై
త్వరలో చర్యలుంటాయని వెల్లడి
అన్నవరం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ పర్యటించారు. సత్యదేవుని దర్శించిన అనంతరం నిత్యకల్యాణమండపం వద్ద నున్న మరుగుదొడ్లను పరిశీలించారు. అపరిశుభ్ర వాతావరణంపై అసహనం వ్యక్తం చేశారు. స్వామివారి కల్యాణకట్ట వద్ద పరిసరాల అపరిశుభ్రతను గమనించి ప్రతి మంగళవారం స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలని, పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని ఈవో సుబ్బారావుకు సూచించారు. అనం తరం పంపా రిజర్వాయర్‌లో నీరు అడుగంటిపోవడం తద్వారా గ్రామంలో నీటిఎద్దడి పొం చి ఉన్న నేపథ్యంలో దాని నివారణకు చర్యలపై పోలవరం, ఇరిగేషన్ అధికారులతో చ ర్చించారు. సీతారాముల దివ్యకల్యాణోత్సవాలలో చక్రస్నానం, సత్యదేవుడి వార్షిక కల్యాణోత్సవాల చక్రస్నానానికి రిజర్వాయిర్‌లో నీటి అవసరాలపై చర్చించారు. పోలవరం అ క్విడెక్టు వద్ద పనుల నేపథ్యంలో ఏలేరు నీరు పంపారిజర్వాయిర్‌కు మళ్లించడంపై సుమా రు 10 కిలోమీటర్ల మట్టిరోడ్డులో ప్రయాణం చేసి పనులు పరిశీలించారు. పోలవరం పను లు త్వరితగతిన పూర్తిచేయాలనే ముఖ్యమం త్రి ఆదేశాల నేపథ్యంలో పనులకు ఆటంకం కలగకుండా ఏలేరు నీటిని పంపాకు మళ్లించడంలో సాధ్యసాధ్యాలపై ఇరిగేషన్, పోలవరం అధికారులతో చర్చించారు. దీనిపై 3 రోజుల్లోగా నివేదికను ఇవ్వాలని పోలవరం అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ విలేకర్లతో మాట్లాడారు. వేసవిలో నీటిఎద్దడి లేకు ండా తీసుకోవలసిన చర్యలపై చర్చించామని.. పంటపొలాల విషయం ఎలా ఉన్నా తాగునీరు పూర్తిస్థాయిలో లేకుంటే ఇబ్బందులు వస్తాయని, అందువల్ల సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స త్యనికేతన్ సత్రంలో మద్యంబాటిళ్లు దొరికిన ఘటనపై ఆయన స్పందించారు. ఇప్పటికే నివేదికను తెప్పించడం జరిగిందని, దీనిపై త్వరలో చర్యలుంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ శేషగిరిరావు, పంపా నీటిసంఘం చైర్మన్ బైరావర్జుల శ్రీరామచంద్రమూర్తి తదితరులున్నారు.