మల్లవరం రహదారి పనులు ప్రారంభం
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:23 AM
గొల్లప్రోలు రూరల్, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మల్లవరం ఆర్‌అండ్‌బీ రహదారి పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. గొల్లప్రోలు మండలం చేబ్రోలు నుంచి మల్లవరం, ఏవీ నగ రం వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి గోతులతో అధ్వానంగా మారడం... ప్రజలు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుం

తీరనున్న ప్రజల కష్టాలు
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
గొల్లప్రోలు రూరల్, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మల్లవరం ఆర్‌అండ్‌బీ రహదారి పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. గొల్లప్రోలు మండలం చేబ్రోలు నుంచి మల్లవరం, ఏవీ నగ రం వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి గోతులతో అధ్వానంగా మారడం... ప్రజలు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా తక్షణం మరమ్మతులు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆదేశించినా కేవలం రోడ్డును తవ్వేసి పనులు నిర్వహించినట్టు ఆయన పేషీకి తప్పు డు సమాచారం ఇచ్చిన విషయంపై ఆంధ్రజ్యోతిలో ఇటు ప్రయాణం నర కం శీర్షికతో వార్తా కథనం ప్రచురితమైంది. రాళ్లు లెగిసిపోయి ఈ రోడ్డుపై ప్రయాణం ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపిసున్నదని కథనం ద్వారా తెలియజెప్పడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. తక్షణం పనులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పేషీ నుంచి ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆదే శాలు అందాయి. దీంతో వారిలో కదలిక వచ్చింది. శుక్రవారం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం తారురోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. పనులు ప్రారంభం కావడంపై చేబ్రోలు, ఏపీ, ఏకేమల్లవరం సహా ఎనిమిది గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.