డబుల్ ‘కిక్కు’
ABN , Publish Date - Jan 14 , 2025 | 12:42 AM
భోగిరోజు పం డుగ సందడి ఓవైపు,కోడి పం దాల హడావుడి మరోవైపు కనిపించగా,మద్యం అమ్మకాలకు యమ జోరుగా సాగాయి.
రాజమహేంద్రవరం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి):భోగిరోజు పం డుగ సందడి ఓవైపు,కోడి పం దాల హడావుడి మరోవైపు కనిపించగా,మద్యం అమ్మకాలకు యమ జోరుగా సాగాయి.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రూ.28.40 కోట్ల విలువైన మద్యాన్ని సోమవారం ఒక్కరోజే డిస్టలరీలు విక్రయించా యి.గతేడాది ఇదే భోగి రోజు రూ.12.60 కోట్ల మద్యాన్ని ఆయా డిస్టలరీల స్టోర్లు విక్రయించాయి. అంటే ఏకంగా రెట్టింపు పైగానే ఈసారి అమ్మకాలు జరగడం విశేషం. ఇందులో కాకినాడ జిల్లాకు సంబంధించి రూ.11.25 కోట్లు, కోనసీమ జిల్లాలో రూ.7 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో రూ.10.15 కోట్ల విలువైన మద్యాన్ని ఆయా జిల్లాల్లో ఉన్న మద్యం దుకాణాలు కొనుగోలు చేసినట్టు సమాచారం.