Pithapuram: ప్రారంభమైన జనసేన 12వ ఆవిర్భావ సభ.. జగన్‌పై సెటైర్లు వేసిన నాగబాబు..
ABN , Publish Date - Mar 14 , 2025 | 06:40 PM
పిఠాపురం చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు.

కాకినాడ జిల్లా: పిఠాపురం చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు. జనసేన నేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఇప్పటికే సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. కాగా, లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తల కోసం ప్రత్యేక గ్యాలరీలను పార్టీ వర్గాలు ఏర్పాటు చేశాయి. ఒక్కో గ్యాలరీలో సుమారు 2,500 మంది కూర్చొనేలా సిద్ధం చేశారు. అయినా భారీగా కార్యకర్తలు తరలిరావడంతో సభా ప్రాంగణం బయటే పెద్దఎత్తున అభిమానులు, కార్యకర్తలు నిలిచిపోయారు. కాగా, మరికొద్దిసేపట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిత్రాడ సభా ప్రాంగణం వద్దకు చేరుకోనున్నారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.."జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలకు జనసేన 12వ ఆవిర్భావ శుభాకాంక్షలు. అధికారం వచ్చింది కదా అని నేతలెవరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అందరూ ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో చూశాం. నోటి దురుసు ఉన్న నేతకు ప్రతిపక్ష హోదా దక్కలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి హాస్యనటుడు కలలు కంటూనే ఉంటారు. మరో 20 ఏళ్ల వరకూ కలలు కంటూనే ఉండాలని సలహా ఇస్తున్నా. రాజకీయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలని పవన్ చెప్పారు. పవన్ కల్యాణ్ క్రమశిక్షణ కలిగిన నేత. 12 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఆయన ఎదుర్కొన్నారు. పిఠాపురంలో ఘన విజయం సాధిస్తామని పవన్‌కు ముందే తెలుసు. రాబోయే 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగం చూడబోతోంది. పదవులు వచ్చినా, రాకపోయినా ఆయనకు సేవలు చేస్తాం. ప్రజలు బాగోగులు చూసే వ్యక్తి పవన్. అడగకుండానే వరాలు ఇచ్చేది వ్యక్తి పవన్. జనసేనకు ప్రాణవాయువు కార్యకర్తలు, వీర మహిళలు. పవన్‌లా గొప్ప వ్యక్తి కావాలి.. లేకుంటే ఆయనకు అనుచరుడిగా ఉండాలని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Chandrababu lokesh Wishes: జనసేన ఆవిర్భావ దినోత్సవం.. పవన్‌కు సీఎం, లోకేష్ శుభాకాంక్షలు
Amaravati capital construction: మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు.. ముహూర్తం ఎప్పుడంటే