ఆంధ్ర పేపరు మిల్లులో ఏం జరుగుతోంది?
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:29 AM
చారిత్రక రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర పేపరుమిల్లు లిమిటెడ్‌లో ఏం జరుగుతుందో కానీ.. దాని మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఏ కంపెనీ అయినా తన అభివృద్ధితోపాటు కార్మి కుల సంక్షేమం చూడాలి. ఒకపక్క మిల్లు కెపాసీటీ విస్తరి స్తూ మరోపక్క కార్మికులపట్ల యాజమాన్య కుట్రలు, యాజ మాన్యం తరపున ఇక్కడ వ్యవహారాలు చక్కపెడుతున్న వారి దాష్టీకంతో మిల్లు ప్రతిష్ట దిగజారిపోతోంది.
మనుగడకు ముప్పు వాటిల్లే ఘంటికలు
కార్మిక క్షేమం పట్టని ఈడీ ముఖేష్ జైన్
వేతన ఒప్పందాలు లేకుండా వ్యవహారం
పట్టించుకోని గత వైసీపీ ప్రభుత్వం
పరంపర-2 పేరుతో ఉద్యోగాల అమ్మకాలు
పెచ్చుమీరిన దాష్టీకాలు
మహిళా ఉద్యోగిని లోబర్చుకుని మోసం
ఇటీవల పేపర్‌మిల్లు లాకౌట్.. ఆరోజే ఎత్తివేత కూడా..
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
చారిత్రక రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర పేపరుమిల్లు లిమిటెడ్‌లో ఏం జరుగుతుందో కానీ.. దాని మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఏ కంపెనీ అయినా తన అభివృద్ధితోపాటు కార్మి కుల సంక్షేమం చూడాలి. ఒకపక్క మిల్లు కెపాసీటీ విస్తరి స్తూ మరోపక్క కార్మికులపట్ల యాజమాన్య కుట్రలు, యాజ మాన్యం తరపున ఇక్కడ వ్యవహారాలు చక్కపెడుతున్న వారి దాష్టీకంతో మిల్లు ప్రతిష్ట దిగజారిపోతోంది. ఇటీవల పేపర్‌మిల్లుకు లాకౌట్ ప్రకటించగా కూటమి ప్రభుత్వం లోని ఎమ్మెల్యేల చొరవతో లాకౌట్ ప్రకటనను ఆరోజు సాయంత్రానికే విరమించుకన్నారు. ఈ నేపథ్యంలో లోపల ఏం జరుగుతోందో తెలుసుకుందాం..
2019 వరకు యాజమాన్యాలు మారినా కార్మికుల సం ఘాలు పటిష్టంగా ఉండడంతో మిల్లుకు ఇబ్బంది కలగలేదు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేపరుమిల్లు యాజమాన్య వైఖరిలో మార్పు వచ్చింది. దాష్టీకాలు పెరిగా యి. ఉన్నతస్థానాల్లో ఉన్న తెలుగు ఉద్యోగులు 70మంది ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపో యారు. వారి స్థానాలు నార్త్ ఇండియాకు చెందినవారితో నిండిపోయా యి. మూడున్నరేళ్లకోసారి జరిగే వేతన ఒప్పం దానికి తూట్లు పొడవంతోపాటు, సీనియార్టీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల పదోన్నతులు ఆపేశారు. పర్మినెంట్ ఉద్యోగులను ప్రలోభ పెట్టి వారు ఉద్యోగాలు వదిలేసుకునేలా చేసి వాటిని ఏ విధమైన అనుభవం లేనివారికి అ మ్ముకునే స్థాయికి ఫ్యాక్టరీ నిర్వాహకులు చేరా రు. యాజమాన్య దాష్టీకానికి ఇద్దరు ఉద్యోగులు బలైపోయారు. పరంపర-2 పేరుతో మోసపోయిన ఓ పర్మినెంట్ ఉద్యోగి పేపరుమిల్లులోనే సూసైడ్ చేసుకున్నాడు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబుతో ఫ్యాక్టరీ సమస్యల పై చర్చించగా ఓ ఉన్నతస్థాయి కమిటీ నియామకానికి ఆదే శించిన సంగతి తెలిసిందే. కానీ యాజమాన్య మొండి వైఖ రిని తట్టుకోలేక ఈ నెల 2వ తేదీ నుంచి కార్మికులు సమ్మె కు దిగారు. వాళ్లను బెదిరించడానికి ఆదివారం అర్ధరాత్రి తర్వాత నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. కూటమి నాయకులు రంగంలోకి దిగడంతో యాజమాన్యం లాకౌట్ విరమించింది.
ముఖేష్ జైన్ దాష్టీకాలు
మిల్లు ఆరంభం నుంచి యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య మూడున్నరేళ్లకోసారి వేతన ఒప్పందం జరుగుతుంది. ఈ సమయంలో పర్మినెంట్ ఉద్యోగులకు జీతాలు పెంచడం పదోన్నతులు ఇవ్వడంతోపాటు, కాంట్రాక్టు కార్మికుల సీని యార్టీని పరిగణించి వారిని పర్మి నెంట్ చేయడం ఆనవా యితీగా వచ్చేది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఏడాది జూలై నుంచి డిసెంబరు 23 మధ్యలో రాబోయే మూడున్నరేళ్లకోసం ఒప్పందం జరగాలి. ఈ వేతన ఒప్పం దానికి యాజమాన్యంతో కుమ్మక్కయిన ముఖేష్ జైన్ గండి కొట్టారు. కీలక స్థానాల్లో ఉన్న తెలుగు ఉద్యోగులపై పగ పట్టినట్టు వ్యవహరించడంతో 60నుంచి 70మంది ఉద్యో గాలు మానేసి వెళ్లిపోవడం గమనార్హం. తన మాట వినే వాళ్లను మాత్రం కొంతమందిని దగ్గర చేర్చుకున్నాడు. తన ఇంట్లో పనిచేసే వ్యక్తుల భార్యలకు ఒకరికి స్టోర్‌లో, మరొ కరికి హెచ్‌ఆర్‌లోనూ ఉద్యోగులివ్వడం గమనార్హం. అతని బాధలు తట్టుకోలేక కమల కిశోర్ బ్రెయిన్ ట్యూమర్, విజయ్ అనే సివిల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి గుండె పోటుతో మృతిచెందినట్టు సమాచారం. పరంపర-2 పేరుతో ఉద్యోగాలిస్తామని వేరేవాళ్ల దగ్గర డబ్బు తీసుకుని ఉద్యోగం ఇవ్వకపోవడంతో తట్టు కోలేక పర్మినెంట్ ఉద్యోగి ఎస్.సత్యనారాయణ పేపరు మిల్లులోనే సూసైడ్ చేసుకున్నాడు. దీనిపై కూడా కేసు నమోదైంది. తర్వాత ఓ రాజకీయ నేత సహ కారంతో రూ.23 లక్షలకు బాధిత కుటుంబంతో ఒ ప్పందం పెట్టుకు న్నట్టు సమాచారం. ఇక్కడ టీఎన్‌టీ యూసీ నేతగా ఉన్న ప్రవీణ్ చౌదరిని లోబర్చుకుని అత న్ని వైసీపీ నేతలకు దగ్గరయ్యేలా చేసి అతనితో కోర్టులో కేసు వేయించి ఒప్పందంలో జాప్యం జరి గేలా ప్రయత్నం జరిగింది. తర్వాత అతను కేసు తీసేసు కున్నా కార్మికులు అడిగిన రూ.10,500 వేతన పెంపు ఒప్పందానికి అం గీకరించకుండా యాజమాన్యం హైకోర్టులో కేసు వేసింది. తర్వాత పరంపర-2 పేరుతో సీనియర్లు అయిన పర్మినెంట్ ఉద్యోగులకు కొంత డబ్బు ఆశచూపి వారిని ఉద్యోగ విర మణ చేయించాడు. వారి స్థానంలో కాంట్రా క్టు కార్మికులను సీనియార్టీ ప్రకారం పర్మినెం ట్ చేయకుండా, అసలు పేపరుమిల్లుతో సంబంధం లేని సుమారు 150మంది వద్ద రూ.8లక్షల నుంచి రూ.20లక్షల వరకూ ఒకొక్కరి వద్ద తీసుకుని వారికి ఉద్యోగా లివ్వడం గమనార్హం. పైగా వారికి కూడా కనీస వేతనం రూ.11,500 వరకూ మాత్రమే. అదీ పూర్తిగా రాదు. ఇలా కార్మికులను, వారి కుటుంబాలను నిలువునా ముంచేశారు.
అరెస్ట్ చేయని పోలీసులు
ఈడీ ముఖేష్ జైన్ సెక్యూర్టీ గార్డుగా పనిచేస్తున్న ఒక మహిళను ప్రలోభపెట్టి మోసం చేసినట్టు గత నవంబరులో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. బొమ్మూరు సీఐ కాశీ విశ్వేశ్వరరావు కేసు నమోదు చేసి నిందితుడిని ఇంతవరకూ అరెస్ట్ చేయలేదు. ముఖేష్ రాజమహేంద్ర వరం నుంచి పరారై హైదరాబాద్‌లోని తన సోదరి ఇంట్లో నుంచి ఇక్కడ పేపరుమిల్లు వ్యవహారాలు చక్కపెడుతుం డడం గమనార్హం. ఆయన ఫోన్ కూడా పనిచేస్తుందని అందరూ చెబుతున్నారు. కానీ బొమ్మూరు పోలీసులకు మాత్రం ఆయనను అరెస్ట్ చేసే తీరిక లేకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సీఎం చంద్రబాబుతో కూటమి నేతల భేటీ
పేపరుమిల్లును కాపాడుకోవడంకోసం ఇటీవల రాజ మండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ ఇటీవల సీఎం చంద్రబాబును కలసి సమస్యను వివరించగా ఆయన యాజమాన్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎంతో చరిత్ర గల పేపరుమిల్లు
రాజమండ్రిలో 1912లో బ్రిటీష్‌వాళ్లు కార్నాటిక్ పేపరుమిల్లు లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేశారు. 1929లో ఆంరఽధ పేపరుమిల్లు లిమిటెడ్‌గా మారింది. 1953లో మద్రాసు నుంచి విడిపోయి ఉమ్మడి ఆంధ్ర ఏర్పడిన తర్వాత ప్రభుత్వం దీనిని స్వాధీనం చేసుకుంది. రోజుకు 10 టన్నులు ఉత్పత్తి లక్ష్యంగా ఉండేది. 1964లో ప్రైవేట్ భాగ స్వామ్యం వచ్చింది. 2011లో అమెరికా కంపెనీ ఇంట ర్నేషనల్ పేపరు చేతిలోకి వెళ్లింది. 75 శాతం వాటా వాళ్లకు దక్కింది. మిగతా ప్రభుత్వ వాటాగా ఉంది.2019లో కర్నాట కకు చెందిన వెస్ట్‌కోస్ట్ పేపరుమిల్లు లిమిటెడ్ (డబ్ల్యుసీ పీఎం)కు చెందిన ఎస్.ఎన్ బంగూరీ కొన్నారు. తర్వాత దానికి ఈడీగా, చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్‌గా రాజస్థాన్‌కు చెందిన ముఖేష్ జైన్ నియమితులయ్యారు. అక్కడ నుంచి ఈ మిల్లుకు కష్టాలు ఆరంభమయ్యాయి. ఇక్కడ పర్మినెంట్ వర్కర్లు సుమారు 800, పర్మినెంట్ ఉద్యోగులు 550 వరకూ ఉండగా, కాంట్రాక్టు కార్మికులు సుమారు 2 వేలమంది ఉన్నారు. ప్రస్తుతం రోజుకు రూ.5 కోట్ల టర్నో వర్‌గా ఉంది.ఏడాదికి రూ.2 వేల కోట్లు టర్నోవర్‌తో పేపరుమిల్లు నడుస్తోంది.