Share News

10న డిప్యూటీ సీఎం పవన్‌ రాక

ABN , Publish Date - Jan 08 , 2025 | 01:11 AM

రెడ్‌క్రాస్‌ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వ ర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు రాష్ట్రంలోనేకాక దేశంలోనే కీర్తిప్రతిష్టలు పొం దడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ అధ్యక్షుడు షాన్‌మోహన్‌ సగిలి హర్షం వ్యక్తంచేశారు.

10న డిప్యూటీ సీఎం పవన్‌ రాక
రెడ్‌క్రాస్‌ తలసేమియా సేవా కేంద్రంలో యువకునికి బహుమతులు అందిస్తున్న షాన్‌మోహన్‌

రెడ్‌క్రాస్‌ సేవలు ప్రశంసనీయం : కలెక్టర్‌

కార్పొరేషన్‌(కాకినాడ), జనవరి 7(ఆంధ్ర జ్యోతి): రెడ్‌క్రాస్‌ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వ ర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు రాష్ట్రంలోనేకాక దేశంలోనే కీర్తిప్రతిష్టలు పొం దడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ అధ్యక్షుడు షాన్‌మోహన్‌ సగిలి హర్షం వ్యక్తంచేశారు. రెడ్‌క్రాస్‌ జిల్లా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్‌ ముందుగా రెడ్‌క్రాస్‌ వ్యవస్థాపకులు సర్‌ జీసీ హెన్రీ డ్యునంట్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రెడ్‌క్రాస్‌ చైర్మ న్‌ వైడీ రామారావుతో కలిసి రెడ్‌క్రాస్‌ జనహి త జనరిక్‌ మెడికల్స్‌, ఆసుపత్రి, రక్తదాన వా హనం, బ్లడ్‌బ్యాంకు, ఐబ్యాంకు, తలసేమియా వ్యాధిగ్రస్తుల సేవా కేంద్రాలను సందర్శించా రు. తలసేమియా బాధితులైన పిల్లలకు పం డ్ల బుట్టలను అందజేసి వారితోను, వారి తల్లి దండ్రులతోను వివరాలు అడిగి తెలుసుకున్నా రు. రెడ్‌క్రాస్‌ తలసేమియా కేంద్రంలో రక్తా న్ని ఎక్కించుకుంటూ ఎంబీబీఎస్‌ సీట్‌ పొం దిన యువకునికి బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రెడ్‌ క్రాస్‌ తలసేమియా కేం ద్రం ద్వారా రక్తం ఎక్కించుకుంటున్న వారెవరైనా జనవరిలో బోన్‌ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్న వారికి రెడ్‌క్రాస్‌ తరపున లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని కలెక్టర్‌ ప్రకటించారు. రెడ్‌క్రాస్‌ సంస్థ ప్రతాప్‌నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న శిశు, మహిళా సంక్షే మ, శిక్షణా కేంద్ర భవనాన్ని సందర్శించారు. రెడ్‌క్రాస్‌ కార్యదర్శి కె.శివకుమార్‌, వైస్‌చైర్మన్‌ ఎన్‌.సుగుణ, కోశాధికారి ఎన్‌వివిఆర్‌కె ప్రసాద్‌బాబు, ఇంజనీర్‌ ఎస్‌వీ ఎస్‌ చంద్రశేఖర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2025 | 01:11 AM