Share News

జనసేన సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:26 AM

పిఠాపురం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కాకినా డ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ శివారులో నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ జయకేతనం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న ట్టు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదివా

జనసేన సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

పిఠాపురం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కాకినా డ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ శివారులో నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ జయకేతనం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న ట్టు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. సభ దిగ్విజయం చేసేందుకు కృషి చేసి న అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలి పారు. సభా ప్రాంగణాన్ని వేడుకకు అనువుగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన నియోజకవర్గ నా యకులు ఓదూరి నాగేశ్వరరావు, కిషోర్‌, కరణం సూరిబాబులకు, జయకేతనం విజయవంతం చేసేందుకు సభా ప్రాంగణం వద్ద కృషి చేసిన నాయకులు బొజ్జా రాంప్రసాద్‌, తలారి శ్రీనివాస్‌, మొగ లి రాజా, పొలం రాజేష్‌, కంచర్ల భవానీశంకర్‌, పులపా రాజేష్‌, మేళం రామకృష్ణ, పిండి శ్రీను, గరగ అయ్యప్ప, చక్కపల్లి వినయ్‌, పబ్బినీడి ప్రసాద్‌కు, సభా వద్ద పనిచేసిన వలంటీర్లు, వీరమహిళలు, జనసైనికులుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Updated Date - Mar 24 , 2025 | 12:26 AM