Share News

దివ్యాంగుల అభ్యున్నతికి ‘కూటమి’ కృషి

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:46 AM

దివ్యాంగుల కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ అన్నారు.

దివ్యాంగుల అభ్యున్నతికి    ‘కూటమి’ కృషి

మలికిపురం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జనచైతన్య దివ్యాంగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో మలికిపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దివ్యాంగ సంఘం నాయకులు మాట్లాడుతూ 2016 దివ్యాంగుల చట్టం అమలు చేయాలని, ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలని, దివ్యాంగులకు ప్రభుత్వ రుణాలు అందజేయాలని తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో బి.నరసింహస్వామి, ఎస్‌ఎన్‌ మూర్తి, వెంకటలక్ష్మి, సుధాకర్‌, ఏసుబాబు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 12:46 AM