పన్ను పోటు!
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:39 AM
పన్నుల వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది.. గతంలో పోటీపడి మరీ పన్నుల వసూళ్లు చేసేవారు. ప్రస్తుతం సిబ్బంది పెరిగినా పన్నుల వసూళ్లు మాత్రం మం దగించాయి.
మొత్తం రూ. 81.32 కోట్లు
వసూలు చేసింది రూ.11.50 కోట్లు
వసూలు చేయాల్సింది రూ.70 కోట్లు
జిల్లా వ్యాప్తంగా తీవ్ర నిర్లక్ష్యం
అయినా పట్టని యంత్రాంగం
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
పక్కదారి పడుతున్న నగదు
రాజమహేంద్రవరం రూరల్, జనవరి 10 (ఆంధ్ర జ్యోతి): పన్నుల వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది.. గతంలో పోటీపడి మరీ పన్నుల వసూళ్లు చేసేవారు. ప్రస్తుతం సిబ్బంది పెరిగినా పన్నుల వసూళ్లు మాత్రం మం దగించాయి. సచివాలయ సిబ్బంది చేసే పని చాలా తక్కువ. అటువంటిది కనీసం పన్నులు వసూ ళ్లపై కూడా దృష్టి సారించడంలేదు. దీనికి జిల్లాలో పన్నుల వసూళ్లే ఒక ఉదాహరణ. ప్రతి ఏడాది మార్చి నుంచి మార్చికి పన్నుల వసూళ్లు లెక్కిస్తారు. మరో రెండు నెలల్లో మార్చి రాబోతుంది.ఇప్పటికి కేవలం 20 శాతం పన్నులు వసూళ్లు చేయలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.ఒకవైపు కలెక్టర్ పన్నులు నూరు శాతం వసూలు చేయాలంటూ అధికా రులకు ఆదేశాలు జారీ చేస్తున్నా పెడచెవిన పెడుతున్నారన్న ఆరోపణలు విని పిస్తున్నాయి.గ్రామాలైనా,పట్టణాలైనా ప్రగతి సాధించా లంటే పన్నుల వసూళ్లు తప్పనిసరి..జిల్లాలో పన్నుల వసూళ్లు చూస్తే పని గాడి తప్పినట్టనిపిస్తుంది.జిల్లా వ్యాప్తంగా సుమారు 19 శాతం వసూలు కాలేదంటే పంచాయతీ అధికారుల అలసత్వం అర్ధం చేసుకోవచ్చు.
18 శాతమే వసూలు..
జిల్లాలో రాజమహేంద్రవరం,కొవ్వూరు డివిజన్లకు సం బంధించి 300 పంచాయతీల్లో సుమారు రూ.81,32,64, 150లు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటికి కేవలం రూ.11.50 కోట్లు మాత్రమే వసూళ్లు చేయడం గమనా ర్హం.రాజమహేంద్రవరం డివిజన్ 147 గ్రామాల్లో రూ.50,94,276 కొవ్వూరు డివిజన్153 గ్రామాలకు రూ.16.29 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.వసూలు చేసింది సగటున 18 శాతం మాత్రమే.వచ్చే రెండు నె లల్లో సుమారు రూ.70 కోట్ల వరకూ వసూలు చేయా ల్సి ఉంది.జిల్లాలో భవన నిర్మాణాలు పూర్తయినా ఇంకా పన్నులు వేయకుండా ఉన్న భవనాలు వేలల్లో ఉన్నట్టు సమాచారం.జిల్లా కలెక్టరేట్ ఉన్న రాజమహేం ద్రవరం రూరల్ పరిధిలోనే పదుల సంఖ్యలో భవనాలకు చాలా ఏళ్లగా పన్నులు లేవంటే అతిశయోక్తి కాదు.
కలెక్టరేట్ పరిధిలోనూ ఇంతే..
జిల్లా వ్యాప్తంగా వసూళ్లు చేయాల్సిన పన్నులు ఏరి యర్స్ కలిపి రూ.80 కోట్లకు పైబడి ఉంటే జిల్లా కలె క్టర్ కార్యాలయం ఉన్న రాజమహేంద్రవరం రూరల్ మండల పరిధిలోనే ఏరియర్స్‌తో కలిపి మొత్తం రూ.29.13 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 22.28 శాతం అంటే రూ.6.50 కోట్లు మాత్రమే వసూలు చేశారు.ఇంకా సుమారు రూ.22.65 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.
నిబంధనలకు విరుద్ధంగా..
సాధారణంగా వసూలు చేసిన పన్నులు ఎప్పటి కప్పుడు పంచాయతీ ఖాతాలో జమ చేసి నగదు పుస్త కంలో నమోదుచేయాలి.పంచాయతీల పనులకు విని యోగించాల్సి వస్తే సీఎఫ్‌ఎంఎస్ ద్వారా మాత్రమే చెల్లింపులు జరగాలి.చాలా పంచాయతీల్లో నగదు చెల్లిం పులు చేస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా చాలా పంచాయ తీల్లో పన్నుల ద్వారా వసూ లైన సొమ్మును జమ చేయకుండా కార్యదర్శుల వద్దనే ఉంచుకొని వసూలు కానట్టు చూపిస్తూ మార్పింగ్ నివే దికలు ఇస్తున్నారన్న వాదన ఉంది.కలెక్టర్ చొరవ తీసు కొని పంచాయతీల్లో నగదు పుస్తకం(క్యాష్ బుక్)తో పాటు బిల్డింగ్ ప్లాన్ రిజిస్టర్లు పరిశీలించేలా చర్యలు చేపడితే అవకతవకలు బయటపడడంతో పాటు ప్రభుత్వానికి అదనంగా ఆదా యం చేకూరుతుందని పలువురు అంటున్నారు.