కళాశాలకు బయలుదేరి.. అంతలోనే కన్నుమూసి!
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:46 AM
అనపర్తి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): అనపర్తి మండలం పులగుర్త వద్ద మండపేట-రామచంద్రపురం కెనాల్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుగుదురులో నిమ్స్ కళాశాలలో ఫిజియోథెరపీ విద్యనభ్యసిస్తున్న ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాల పా
ఆగి ఉన్న కంటెయినర్‌ను బైక్ ఢీకొని విద్యార్థి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
అనపర్తి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): అనపర్తి మండలం పులగుర్త వద్ద మండపేట-రామచంద్రపురం కెనాల్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుగుదురులో నిమ్స్ కళాశాలలో ఫిజియోథెరపీ విద్యనభ్యసిస్తున్న ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు. ఏఎస్‌ఐ దుర్గాప్రసాద్ వివరాల ప్రకారం.. తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామానికి చెందిన పుచ్చకాయల నవనీత్(22), ద్వారకా తిరుమల మండలం కమరి గ్రామానికి చెందిన మానుకొండ చందు కాకినాడ జిల్లా పెనుగుదురు గ్రామంలోని కిమ్స్ ఫిజియోథెరపీ కళాశాలలో చదువుకుంటూ అదే కళాశాలలోని హాస్టల్‌లో ఉంటున్నారు. ఇద్దరూ బైక్‌పై కళాశాలకు వెళ్తుండగా పులగుర్త గ్రామం వచ్చే సరికి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఖమ్మం నుంచి కాకినాడ వెళ్లే కంటెయినర్‌ను వెనుక నుంచి ఢీకొన్నారు. తీవ్రగాయాలపాలైన ఇద్దరినీ స్థానికులు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే నవనీత్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. చందుకు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్టు ఏఎస్‌ఐ తెలిపారు.
ప్రక్కిలంకలో విషాదఛాయలు
తాళ్లపూడి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): అనపర్తి మండలం పులగుర్త వద్ద జరిగిన ప్రమాదంలో ప్రక్కిలంక గ్రామానికి చెందిన పుచ్చ కాయల నవనీత్ మృతి చెందడంతో ఆ గ్రామ ంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నవ నీత్ పెనుగుదురులోని కిమ్స్ ఫిజియోథెరపీ కళాశాలలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతు న్నాడు. నవనీత్ తండ్రి బాల మురళీకృష్ణ ప్రక్కిలంకలోని పైడి ఐటీఐ కళాశాలలో ప్రిన్సి పాల్‌గా చేస్తుండగా తల్లి భారతి మండలం లోని గజ్జరం గ్రామంలో సచివాలయ మహిళా పోలీస్‌గా పనిచేస్తున్నారు. సోదరుడు స్నేహిత్ రాజమహేంద్రవరం గైట్ కశాశాలలో బీఎస్సీ (ఫోరెన్సిక్) ఫైనలియర్ చదువుతున్నాడు. అన్నదమ్ములిద్దరూ కవలలు. నవనీత్ మృతితో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. నవనీత్ తల్లి భారతి రోదనలు మిన్నంటాయి.