నూతనోత్సాహంతో ప్రభుత్వ పథకాలను అమలుచేద్దాం
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:04 AM
నూతన సంవత్సర వేళ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను నూతనోత్సాహంతో సమర్థవంతంగా అమలుచేద్దామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంతి
నూతన సంవత్సర దినోత్సవ స్ఫూర్తిగా సమష్టిగా పనిచేయాలి
న్యూఇయర్ వేడుకలు
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 1 (ఆంధ్ర జ్యోతి): నూతన సంవత్సర వేళ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను నూతనోత్సాహంతో సమర్థవంతంగా అమలుచేద్దామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. బుధవారం కలెక్టర్ చాంబర్‌లో తనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందని, వాటిని విజయవంతంగా ప్రజలకు చేరవేయడంలో సమన్వయంతో పనిచేయాలని కోరారు. నూతన సంవత్సర దినోత్సవ స్ఫూర్తితో సమష్టిగా పనిచేయడం ద్వారా జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా అడుగులు వేద్దామన్నారు. కలెక్టర్‌కు జేసీ చిన్నరాముడు, నగర కమిషనర్ కేతన్‌గార్గ్, ఆర్డీవోలు ఆర్.కృష్ణనాయక్, రాణీ సుస్మిత తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతి కారణంగా సంతాపదినాలు కావడంలో వేడుకలను ఈసారి నిరాడంబరంగా చేశారు.