ఎస్సీ కులగణన పై సోషల్ ఆడిట్ పూర్తికి గడువు పొడిగింపు
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:07 AM
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీల జనాభా గణనపై సోషల్ ఆడిట్ పూర్తి చేయడానికి గడువును పొడిగించినట్టు ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి ఎం.శోభారాణి తెలిపారు.
రాజమహేంద్రవరంసిటీ, జనవరి1 (ఆం ధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీల జనాభా గణనపై సోషల్ ఆడిట్ పూర్తి చేయడానికి గడువును పొడిగించినట్టు ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి ఎం.శోభారాణి తెలిపారు. బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. గత నెల 26 నుంచి ఈనెల 7వ తేదీ వరకు గడువును పొడిగించారని, అభ్యంతరాలను ఈనెల 11 వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని తెలిపారు. సమగ్ర వివరాలు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ మేరకు జీవో జారీ అయ్యిందన్నారు.