సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల ధర్నా
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:40 AM
మున్సిపల్ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్‌యు ఆధ్వర్యంలో బుధవారం రామచంద్రపురం పురపాలక సంఘం కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నా జరిపారు.
రామచంద్రపురం(ద్రాక్షారామ), జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్‌యు ఆధ్వర్యంలో బుధవారం రామచంద్రపురం పురపాలక సంఘం కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నా జరిపారు. పాఠశాలల్లో సమస్యలు పరి ష్కరించాలని నినాదాలు చేశారు. పీడీఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్దూ ఈ సంద ర్భంగా మాట్లాడారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ మేనేజరు పీఎస్‌ఎన్‌మూర్తికి అందించారు. కార్యక్రమం లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం, చింతా రాజారెడ్డి, విద్యార్థులు అంజలి, సురేఖ, సంహిత, పి.నాగదేవి, రిక్షత, రమణి, సదాలక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.