Share News

గోదావరి ట్రోఫి పోటీలకు సర్వం సిద్ధం చేయాలి

ABN , Publish Date - Jan 04 , 2025 | 01:08 AM

సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫి పోటీలకు ఏర్పాట్లు త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు.

గోదావరి ట్రోఫి పోటీలకు సర్వం సిద్ధం చేయాలి

ఆత్రేయపురం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫి పోటీలకు ఏర్పాట్లు త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు. శుక్రవారం లొల్ల లాకుల వద్ద వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం జరిపారు. సంక్రాంతికి ముందుగా నిర్వహించనున్న ట్రోఫి సమయం దగ్గర పడుతున్న నేపఽధ్యంలో అధికారులు సత్వరమే పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు, సమన్వయంతో పనిచేసి సర్‌ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫి పోటీలు, పడవ, ఈత పోటీలతో పాటు రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయా ప్రదేశాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు, ప్రాజెక్టు కమిటీ వైస్‌చైర్మన్‌ కరుటూరి నరసింహారావు, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు ముళ్ళపూడి భాస్కరరావు, కాయల జగన్నాఽథం, తహశీల్దారు రాజేశ్వరరావు, ఎంపీడీవో వెంకటరామన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐలవ్‌ ఆత్రేయపురం బోర్డు ఆవిష్కరణ: ఆత్రేయపురం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద పార్క్‌లో స్వర్గీయ మండపాక సింహాచలం (డ్రాయింగ్‌ మాస్టారు) జ్ఞాపకార్ధం నిర్మించిన ఐలవ్‌ ఆత్రేయపురం ఎల్‌ఈడీ లైటింగ్‌ బోర్డును శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. అనంతరం అల్లూరి సీతరామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. లైటింగ్‌ బోర్డు ఏర్పాటు చేసిన మాస్టారు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో ముదునూరి వెంకట్రాజు, పీఎస్‌ రాజు, కరుటూరి నరసింహారావు, చవల జగన్నాథం, క్షత్రియ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 01:08 AM