విజయదుర్గా పీఠంలో మాజీ మంత్రి ఉమా పూజలు
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:11 AM
మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో శనివారం మాజీ మంత్రి, కృష్ణాజిల్లా మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు పూజలు చేశారు.
రాయవరం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో శనివారం మాజీ మంత్రి, కృష్ణాజిల్లా మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు పూజలు చేశారు. విజయదుర్గా అమ్మవారికి అర్చనలు, హారతులు నిర్వహించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొం దిన అనంతరం మాజీ మంత్రికి వేదపండితులు ఆశీస్సులు అందించారు. గాడ్ సమక్షంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, విజయదుర్గా సేవా సమితి ప్రతినిధి గాదే భాస్కరనారాయణ మాజీ మంత్రిని సత్కరించి జ్ఞాపిక అందించారు. మాజీ మంత్రి వెంట టీడీపీ మండల సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు వడ్డాది పండు, పీఠం ప్రతినిధి గాదే కృష్ణ తదితరులు ఉన్నారు.