వాడపల్లి ఆలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Jan 04 , 2025 | 01:06 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది
ఆత్రేయపురం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. వేకువజామునే స్వామివారికి గోదావరి జలాలను తీసుకువచ్చి స్నపన మూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం తిరుప్పావై వేదపారాయ ణం జరిపారు. నోము ఆచరించిన పలువురు భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంత రం అన్నప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.2,97,671 వచ్చినట్టు ఉప కమిషనరు, ఈవో నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. స్వామివారి అన్నదాన ట్రస్టుకు కాళ్లకు చెందిన మొగళ్ళ మోహన్ కుటుంబ సభ్యులు రూ.50,116 విరాళం ఇవ్వగా, దాతలకు స్వామివారి చిత్రపటం అందించారు.