Share News

'పది' పరీక్షలకు 25,723 మంది విద్యార్థులు

ABN , Publish Date - Jan 08 , 2025 | 12:44 AM

ప్రస్తుత విద్యా సంవత్సరంలో 25,723 మంది విద్యార్థులు ప్రైవేటు, రెగ్యులర్‌గా 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని జిల్లా విద్యాశాఖాధికారి వాసుదేవరావు తెలిపారు. మండలంలోని పిడింగొయ్యిలోని ప్రయివేటు పా ఠశాలలో అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానో పాధ్యాయులతో వార్షిక పరీక్షల నిర్వహణపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహిం చారు.

'పది' పరీక్షలకు 25,723 మంది విద్యార్థులు
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో వాసుదేవరావు

  • నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి

  • డీఈవో వాసుదేవరావు

రాజమహేంద్రవరం రూరల్‌ జనవరి 7(ఆం ధ్రజ్యోతి): ప్రస్తుత విద్యా సంవత్సరంలో 25,723 మంది విద్యార్థులు ప్రైవేటు, రెగ్యులర్‌గా 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని జిల్లా విద్యాశాఖాధికారి వాసుదేవరావు తెలిపారు. మండలంలోని పిడింగొయ్యిలోని ప్రయివేటు పా ఠశాలలో అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానో పాధ్యాయులతో వార్షిక పరీక్షల నిర్వహణపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా డీఈవో మా ట్లాడుతూ జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్‌ టీచర్లు రివిజన్‌ టెస్టుల కార్య క్రమాలను విజయవంతం చేసి తద్వా రా జిల్లా ఉత్తీర్ణత శాతం పెరుగు దలకు కృషిచేయాలన్నారు. పదో తరగతితోపాటు అన్ని తరగతుల వార్షిక పరీక్షల నిర్వహణ, విద్యార్థుల్లో పఠనాశక్తి పెంచ డానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది పదో తరగతిలో 100శాతం ఫలితాలు సాధించా లన్నారు. కార్యక్రమంలో డిట్యూటీ ఈవోలు, ఎంఈవోలు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

  • స్టడీ మెటీరియల్‌ పంపిణీ

గోకవరం, జనవరి 7(ఆంధ్రజ్యోతి): మండలం లోని గురుకుల పాఠశాల్లోని పదో తరగతి విద్యా ర్థులకు పూర్వ విద్యార్థులు మంగళవారం ఉచి తంగా స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా అలుమ్ని అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.సుజ్ఞాన్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులు స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకొని పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించాల న్నారు. పాఠశాల ఆవరణలో ఆహ్లదకర వాతావ రణంతో మంచి ఫలితాలు సాధించే అవకాశ ముందన్నారు. కార్యక్రమంలో అలుమ్ని సభ్యులు పిబి.శ్రీనివాస్‌, పరమహంస, సునీల్‌, సురేంద్ర, ప్రసాద్‌బాబు, శ్రీహరి, నీలి శ్రీనివాస్‌, రవికుమార్‌, ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2025 | 12:45 AM