అలరించేలా!
ABN , Publish Date - Jan 08 , 2025 | 12:39 AM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకేం తక్కువ.. అందమైన బీచ్‌లు లేవా.. ఆహ్లాదం పంచే ప్రకృతి ప్రదేశాలు లేవా.. ఆధ్యాత్మికతను పెంచే ఆలయాలు లేవా.. అన్నీ ఉన్నాయి.. అయినా ఏదో వెలితి.. పర్యాటకాభివృద్ధిలో ఎప్పుడూ వెనుకబాటే.
పర్యాటకానికి స్వర్ణాంధ్ర-2047
ఐదేళ్లలో ప్రణాళికలపై కసరత్తు
18 బీచ్‌ల అభివృద్ధికి ప్రతిపాదనలు
దానవాయిపేట బీచ్‌కు రూ.10 కోట్లు
హోప్ ఐలాండ్‌కు రూ.8 కోట్లు
అన్నవరం కొండపై రోప్‌వే
కాకినాడ ఎన్టీఆర్ బీచ్‌కు రూ.5 కోట్లు
తలుపులమ్మ లోవకు రూ.6 కోట్లు
కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకేం తక్కువ.. అందమైన బీచ్‌లు లేవా.. ఆహ్లాదం పంచే ప్రకృతి ప్రదేశాలు లేవా.. ఆధ్యాత్మికతను పెంచే ఆలయాలు లేవా.. అన్నీ ఉన్నాయి.. అయినా ఏదో వెలితి.. పర్యాటకాభివృద్ధిలో ఎప్పుడూ వెనుకబాటే.. కేరళను మించి అందాలున్నా.. గోవాను మించి బీచ్‌లున్నా ఎందుకో నిర్లక్ష్యం.. కూటమి ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధిపై దృష్టి సారించింది.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 బీచ్‌లను అభివృద్ధి చేయాలని ప్రణాళిక రచించింది.. అంతే కాదు ఆలయాలకు కొత్త రూపు తీసుకురానున్నారు.. సుమారు రూ.35 కోట్లతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు.. ఫిబ్రవరి నాటికి పర్యాటకంపై నివేదిక ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మూడు జిల్లాల కలెక్టర్లు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని పరుగులు తీయించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుధీర్ఘసాగర తీరం దగ్గర నుంచి ప్రఖ్యాత ఆలయాల వరకు పర్యాటకుల కోసం భారీ ప్రాజెక్టులకు పట్టాలెక్కించేందుకు కార్యా చరణ సిద్ధం చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో పూర్తిగా కుంటుపడిన పర్యా టక రంగాన్ని గాడినపెట్టేలా అనేక ప్రతిపాద నలతో విజన్‌ప్లాన్ తయారు చేసింది.ఈ మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ కార్యా చరణ కసరత్తును ప్రభుత్వానికి పంపించారు. అందులో భాగంగా జిల్లాలో సుదీర్ఘ తీర రేఖ పొ డవునా అనేక అందమైన బీచ్‌లున్న నేప థ్యంలో వాటిలో ముఖ్యమైన వాటిని అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించేలా చేయనున్నారు.
మురిపించేలా...
కాకినాడ జిల్లా ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. తొండంగి నుంచి కాకినాడ వరకు సువి శాల సాగరతీరం పర్యాటకులను ఆకర్షిస్తోంది. సముద్రం మధ్యలో హోప్ ఐలాండ్ పర్యాట కు లను కట్టిపడేస్తుంది. కోరంగి మడ అడవులు ఎంతో ప్రసిద్ధి. అన్నవరం నుంచి తలుపులమ్మ లోవ, సామర్లకోట భీమేశ్వరస్వామి, పిఠాపురం పుర్హుతికా అమ్మవారి ఆలయాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. జాతీయస్థాయి పర్యాటకులను ఆకర్షించే సత్తా ఉన్నప్పటికీ జిల్లాను గత వైసీపీ ప్రభుత్వం పర్యాటకంగా గాలికొదిలేసింది. ప్రస్తుత కూట మి ప్రభుత్వం పర్యాటకరం గంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ఐదేళ్ల విజన్ ప్లాన్ తయారు చేస్తోంది. ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. స్వర్ణాంధ్ర-2047 పేరుతో జిల్లాలో 2029లోగా పర్యాటక రంగం అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. దీని ప్రకారం రూ.35కోట్లతో పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనల ప్రణా ళికలు సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 18 బీచ్‌లను ఏపీ కోస్టల్ జోన్ టూ రిజం మాస్టర్ ప్లాన్ కింద అభివృద్ధి చేసే అవ కాశం ఉందని నివేదికలో వివరించారు. తొలుత తొండంగి మండలంలోని దానవాయి పేటలోని బీచ్‌ను రూ.10 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు తయారు చేశారు. వాస్తవానికి ఇక్కడ బీచ్ సువిశాలంగా ఉం టుంది. పర్యాట కులకు సురక్షితంగా ఉంటుంది. అలల తీవ్రత చాలా తక్కువ. పైగా ఇక్కడి నుంచి జాతీయ రహదారి సైతం చాలా దగ్గర.ఈ బీచ్‌ను రూ.10 కోట్లతో తీర్చిదిద్దాలని ప్రతి పాదించారు. అన్న వరం దేవస్థానానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిషా, పశ్చిమ బెంగాల్ నుంచి భక్తులు వేలల్లో వస్తుంటారు. రత్నగిరి కొండ నుంచి సత్యగిరి కొండకు 800 మీటర్ల పొడవునా రూ.6 కోట్లతో రోప్‌వే నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి దగ్గర్లోనే దానివాయిపేట బీచ్ కూడా ఉం డడంతో పర్యా టకపరంగా ఈ ప్రాంతానికి మరింత ఆదరణ లభిస్తుందని అంచనా వేశారు. కాకినాడ తీరం నుంచి రెండు గంటలు ప్రయా ణిస్తే వచ్చే హోప్ ఐలాండ్ పర్యాటక పరంగా పేరొందింది.గత వైసీపీ ప్రభుత్వం హోప్ ఐలాండ్‌ను గాలికొదిలేసింది. బోటింగ్ నిలిపి వేసింది.దీంతో పర్యా టకులు ఈసురోమంటున్నా రు.హోప్ ఐలాండ్‌కు తిరిగి నాటి వైభవం వచ్చేలా చేయడంతో పాటు ఎకో టూరిజం ప్రాజెక్టు కింద రూ.8 కోట్లతో అభివృద్ధి చేయా లని నిర్ణయించారు.కాకినాడ ఎన్టీఆర్ బీచ్‌కు అనేకమంది వస్తుంటారు.ఇక్కడ ఇప్పటికీ కనీస సదుపాయాలు లేవు.చీకటైతే చిన్న లైట్ ఉం డదు.ఈ బీచ్ వద్ద రూ.5 కోట్లతో సర్వహంగులు తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. బీచ్ ఫ్రంట్ వద్ద కన్వెన్షన్ హాల్ నిర్మించ ను న్నారు. తలుపులమ్మ లోవ ఆలయం వద్ద రూ.6 కోట్లతో వివిధ వస తులను తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. కాకి నాడ జిల్లాలో మొత్తం ఏపీ కోస్టల్ జోన్ టూరి జం మాస్టర్ ప్లాన్ కింద 18 బీచ్‌లను తీర్చి దిద్దాల్సి ఉందని ప్రభుత్వానికి పంపిన నివే దికలో వివరించారు.అటు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కోనసీమలో హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుకు పెట్టుబడులు వస్తున్నా యని..వీటికి అనువైన భూములు గుర్తించి పం పాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.
టార్గెట్ ఫిబ్రవరి
ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రభు త్వం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి ఫిబ్రవరి నాటికి నివేదికలు పంపాలని కలెక్టర్లను ఆదేశించింది. ప్రధానంగా కాకినాడ కోరంగి వద్ద ఫోర్ సీజన్ హోటల్ పెట్టుబడులకు ముందుకు వచ్చింది.దీనికి 40 ఎకరాలను ఎంపిక చేసి ప్రతి పాదలను పంపాలని సూచించింది.రాజమహేంద్రవరంలో ఐఆర్ సీటీసీకి 3 ఎకరాలను అన్వేషిం చి వివరాలు పంపాలని కోరింది. కోనసీమలోని పిచ్చు కలంక వద్ద మహీంద్రా హాలిడేస్ క్లబ్ ఏర్పా టుకు ముందుకొచ్చింది. ఇందుకు 26 ఎకరాల వరకు అవసరమని అంచనా వేశా రు.దీనికి సంబంధించి నివేదికలను ఫిబ్ర వరిలో పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. స్వదేశీ దర్శన్ స్కీం కింద కోనసీమ, పాపి కొండలను అభివృద్ధి చేయాలని నిర్ణ యిం చింది. వీటికి భారీగా నిధులు రాను న్నాయి. ఏడు పర్యాటక యాంకర్ హబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాటిని అభివృద్ధి చేయా లని నిర్ణయించింది. ఇందులో రాజమ హేం ద్రవరంలో పర్యాటకపరంగా ఇంకా ఏమేం చేయాలనే దానిపై సలహాలు, సూచనలు, ఆలోచనలు ఫిబ్రవరిలోగా పంపాలని ప్రభు త్వం ఆదేశించింది.