వాడపల్లికి పోటెత్తిన భక్తజనం
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:05 AM
ఆత్రేయపురం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నూతన సంవత్సర వేళ భక్తజనంతో కిటకిటలాడింది. బుధవారం వేకువజామునే స్వామివారికి గోదావరి జలాలతో అభిషేకం, తిరుప్పావై సేవా కాలం నిర్వహించి భక్తులకు దర్శనాలకు అనుమతించారు. నూతన సంవత్సరానికి స్వా
రూ.5.87లక్షల ఆదాయం
ఆత్రేయపురం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నూతన సంవత్సర వేళ భక్తజనంతో కిటకిటలాడింది. బుధవారం వేకువజామునే స్వామివారికి గోదావరి జలాలతో అభిషేకం, తిరుప్పావై సేవా కాలం నిర్వహించి భక్తులకు దర్శనాలకు అనుమతించారు. నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ ఫలపుష్పాలతో అలం కరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివార్ల ఫోటోలను ఏర్పాటు చేసిన ఫోటోషూట్ వద్ద భక్తుల సందడి కనిపించింది. అశేష భక్తజనం స్వామివారిని దర్శంచుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఏడువారాల నోము ఆచరించిన భక్తులు స్వామివారికి అష్టోత్తర పూజలు నిర్వహించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ సేవల ద్వారా రూ.5,87,238 ఆదాయం లభించినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.