Share News

సాగునీటి కష్టాల తొలగింపు

ABN , Publish Date - Jan 10 , 2025 | 01:09 AM

పంట భూములకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం లో మూసుకుపోయిన పంటకాలువను ఎక్స్‌కవేటర్‌తో తొలగించి సాగునీటి ఇబ్బం దులు పరిష్కరించారు.

సాగునీటి కష్టాల తొలగింపు

ఆలమూరు, జనవరి 9(ఆంధ్రజ్యోతి): పంట భూములకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం లో మూసుకుపోయిన పంటకాలువను ఎక్స్‌కవేటర్‌తో తొలగించి సాగునీటి ఇబ్బం దులు పరిష్కరించారు. జొన్నాడ మెయిన్‌ కాలువ నుంచి ఆలమూరు వచ్చే పంట కాలువ ఇటీవల పూర్తిగా మూసుకుపోయింది. దీంతో దిగువ ప్రాంతాల భూములకు సాగునీరు చేరక రైతులు ఇబ్బం దులు పడుతున్నారు. ఇటీవల నూతనం గా ఎన్నికైన చింతలూరు సాగునీటి సం ఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్‌కు తెలపడంతో ఆయన స్పందించారు. గురు వారం పంట కాలువను ఎక్స్‌కవేటర్‌తో శుభ్రం చేసే చర్యలు చేపట్టారు. సాగునీరు సక్రమంగా చేరేలా చర్యలు చేపట్టిన సాగునీటి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ను రైతులు అభినందించారు.

Updated Date - Jan 10 , 2025 | 01:09 AM