Google Maps : గూగుల్‌ను నమ్ముకొని కొండల్లోకి..
ABN , Publish Date - Feb 01 , 2025 | 05:17 AM
కొండల్లోకి వెళ్లి వాహనాన్ని గోతుల్లోకి దింపాడు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపి.. ఉ

యాడికి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): గూగుల్ తల్లిని నమ్ముకొని ఓ కంటెయినర్ లారీ డ్రైవర్ దారితప్పాడు. కొండల్లోకి వెళ్లి వాహనాన్ని గోతుల్లోకి దింపాడు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపి.. ఉదయాన్నే స్థానికుల సాయంతో బయటపడ్డాడు. అనంతపురం జిల్లా యాడికి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని చిక్కమంగళూరు నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని అలా్ట్రటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఐరన్ ఓర్ కంటెయినర్ లారీ బయల్దేరింది. డ్రైవర్ ఫరూక్‌కు అడ్రస్ తెలియక స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చాడు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో మ్యాప్ సూచించిన విధంగా డ్రైవ్ చేసుకుంటూ యాడికి మండలంలోని కొండల్లో ఉన్న రామన్న గుడిసెలు గ్రామ సమీపానికి వెళ్లాడు. అక్కడ లారీ అదుపుతప్పి గోతిలో ఇరుక్కుపోవడంతో రాత్రంతా అక్కడే గడిపాడు. శుక్రవారం ఉదయం రెండు ఎక్స్‌కవేటర్లను తెప్పించి కంటెయినర్ లారీని బయటకు తీయించారు.
For AndhraPradesh News And Telugu News