Share News

AP High Court ఆ స్పీడ్‌ బ్రేకర్లపై ఏం చర్యలు తీసుకున్నారు

ABN , Publish Date - Apr 17 , 2025 | 05:49 AM

ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏర్పాటైన స్పీడ్‌ బ్రేకర్లపై తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్‌కు ఆదేశించింది. స్పీడ్‌ బ్రేకర్లు ప్రాణాపాయంగా మారుతున్నాయని పిటిషనర్‌ యోగేష్‌ పిలుపునిచ్చారు

AP High Court ఆ స్పీడ్‌ బ్రేకర్లపై ఏం చర్యలు తీసుకున్నారు

  • కౌంటర్‌ వేయాలని ఆర్‌అండ్‌బీ చీఫ్‌కు హైకోర్టు ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): రోడ్ల పై నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన స్పీడ్‌ బ్రేకర్లను తొలగించడంతోపాటు ఇండియన్‌ రోడ్‌ కాంగ్రె్‌స మార్గదర్శకాలకు అ నుగుణంగా వాటిని మార్చేలా ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖ లు చేయాలని రహదారులు భవనాల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ను హైకోర్టు ఆదేశించింది. వ్యా జ్యం లో ప్రతివాదులుగా ఉన్నవారికి నోటీసు లు జారీ చేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. స్పీడ్‌ బ్రేకర్ల సమస్యపై న్యాయవాది తాండవ యోగేష్‌ పిల్‌ దాఖలు చేశారు. ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌-1996 నిబంధనలు వివరించారు. నిబంధనలకు విరు ద్ధంగా ఏర్పాటు చేసిన స్పీడ్‌ బ్రేకర్లతో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.

Updated Date - Apr 17 , 2025 | 05:49 AM