Higher Secondary Educationఫ ఇంటర్‌లో వంద మార్కులకు గణితం పరీక్ష
ABN , Publish Date - Mar 25 , 2025 | 05:44 AM
ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు కొనసాగుతున్నాయి. కొత్త మార్కుల విధానాన్ని 2025-26 విద్యా సంవత్సరానికి విడుదల చేసిన ఇంటర్ బోర్డు, ఒక మార్కు ప్రశ్నలు ప్రవేశపెట్టింది, దీని ద్వారా ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఇటీవల సబ్జెక్టులు విలీనం చేస్తూ తీర్మానం చేసిన ఇంటర్ బోర్డు.. ఇప్పుడు మార్కుల విధానాన్ని కూడా మార్చింది. 2025-26 విద్యా సంవత్సరానికి కొత్త మార్కుల విధానాన్ని విడుదల చేసింది. ఇందులో ఒక మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టింది. గణితంలో 12, ఫిజిక్స్‌లో 9, కెమిస్ట్రీలో 9, బోటనీలో 5, జువాలజీలో 4, సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్‌లో 10 చొప్పున, కామర్స్‌లో 4, అకౌంటెన్సీలో 4, ఇంగ్లిష్ లో 10 ఒక మార్కు ప్రశ్నలు ఉంటాయి. దీనివల్ల ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే గణితం-ఏ, బీలను విలీనం చేయడం వల్ల ఇకపై ఏటా 100 మార్కులకు గణితం పరీక్షలు జరుగుతాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ రాత పరీక్ష 85 మార్కులకు జరుగుతుంది.
15 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. బోటనీ, జువాలజీని కలిపి బయాలజీ చేసినా.. మార్కుల వెయిటేజీలో వేర్వేరుగా ప్రశ్నలు ఇవ్వనున్నారు. బోటనీ 43 మార్కులకు, జువాలజీ 42 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. మిగిలిన 15 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి.
For AndhraPradesh News And Telugu News