Share News

Nimmala Ramanaidu: ఇరిగేషన్ శాఖ అధికారులకు గుడ్ న్యూస్

ABN , Publish Date - Jan 07 , 2025 | 09:59 PM

Nimmala Ramanaidu: రాష్ట్రంలోని ఇరిగేషన్ అధికారుల ప్రమోషన్ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తానని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు.

Nimmala Ramanaidu: ఇరిగేషన్ శాఖ  అధికారులకు గుడ్ న్యూస్
AP Minister Nimmala Ramanaidu

అమరావతి, జనవరి 07: సమస్యలను పరిష్కరించి.. అడ్‌హాక్ పదోన్నతులకు ఉన్న అడ్డంకులను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఇరిగేషన్ శాఖ అధికారులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భరోసా ఇచ్చారు. మంగళవారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడిని ఇరిగేషన్ ఇంజనీర్స్ ఆసోసియేషన్ సభ్యులు కలిశారు. గత ప్రభుత్వ హయాంలో పదోన్నతులు లేక ఎంతో నష్టపోయామని మంత్రి రామానాయుడు దృష్టికి వారు తీసుకు వెళ్లారు.

ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు పైవిధంగా స్పందించారు. గత జగన్మోహాన్ రెడ్డి తుగ్లక్ పాలన ఫలితంగా అన్ని శాఖల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఆయన పేర్కొ్న్నారు. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డీఈ స్దాయి నుంచి సీఈ స్దాయి వరకు వందల సంఖ్యలో ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు లబ్దిపొందనున్నారు.

గత జగన్ ప్రభుత్వ హయాంలో.. సంక్షేమంపై దృష్టి పెట్టారు. దీంతో రాష్ట్రాభివృద్ధిని అంతగా పట్టించుకోలేదు. దాంతో బటన్ నొక్కే కార్యక్రమాన్ని మాత్రం గత ఐదేళ్లో నిరంతరాయంగా కొనసాగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. రహదారులు లేవు. పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు. అదీకాక రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు సైతం పక్క రాష్ట్రంలోకి తరలిపోయాయి.


ఇక గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీకి వచ్చిన లూలూ సంస్థ సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరించింది. ఈ సంస్థ సైతం తెలంగాణలో పెట్టుబడులు పెట్టింది. ఇక 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు.. కూటమికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాజధాని అమరావతి పనులు ప్రారంభమైనాయి. అలాగే రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ సైతం త్వరితగతిన పూర్తి చేసుకొనుంది.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 07 , 2025 | 10:03 PM