Jammalamadugu MLA: జగన్.. కడప జిల్లాలో పుట్టడం దరిద్రం
ABN , Publish Date - Feb 18 , 2025 | 05:54 PM
Jammalamadugu MLA: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలిలోపై జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్.. కడప జిల్లాలో పుట్టడం దరిద్రమని అయన అభివర్ణించారు. జైలు గోడలు చూడానికే వైఎస్ జగన్ ఈ పరామర్శలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

అమరావతి, ఫిబ్రవరి18: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి మంగళవారం అమరావతిలో మండిపడ్డారు. వైఎస్ జగన్ లాంటి వ్యక్తి కడప జిల్లాలో పుట్టడం దరిద్రమని ఆయన పేర్కొన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేయని తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. త్వరలో జైలు పక్షులన్నీ ఒక చోట చేరుతాయని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. జైలుకెళ్లే జగన్ పరామర్శల పేరుతో జైలు గోడలను చూడటానికి వెళ్తున్నాడని ఎద్దేవా చేశారు.
జగన్ లాంటి వ్యక్తి రాజకీయాలకు పనికి రాడని ఆయన పేర్కొన్నారు. చెట్టుకు వేరు పురుగు పట్టినట్టు కార్యకర్తలు పార్టీనీ అంటి పెట్టుకొని ఉన్నారన్నారు. వైఎస్ఆర్‌సీపీ.. డైనోసార్ పార్టీ అని అభివర్ణించారు. తన సొంత నియోజకవర్గం పులివెందులకు నీరు ఇవ్వ లేని వ్యక్తి వైఎస్ జగన్ అని ఆయన అభివర్ణించారు. పేదలకు ఇల్లు కూడా ఇవ్వ లేని వైఎస్ జగన్ మాత్రం.. తన కోసం ఆరు ప్యాలెస్‌లు కట్టుకొన్న ఘనుడు అంటూ ఎద్దేవా చేశారు.
మంగళవారం ఉదయం అరెస్టయి.. విజయవాడ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వైఎస్ జగన్ ములాఖత్ జరిపారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌పై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే వంశీని ఎందుకు పరామర్శించారో.. చెప్పాలంటూ వైఎస్ జగన్‌కు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Also Read: విడదల రజినికి తాత్కాలిక ఊరట
అందులోభాగంగా పలు ప్రశ్నలు సంధిస్తూ.. ఆయనకు పల్లా శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. అలాగే మంత్రి అనగాని సత్య ప్రసాద్ సైతం జగన వ్యవహార శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మాజీ మంత్రి, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం కాస్తా ఘాటుగా స్పందించారు.
Also Read: వాయిదా పడనున్న కేబినెట్ భేటీ !
వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి సైతం జైలులో ఉన్నాడని.. అతడిని సైతం పరామర్శిస్తావా? అంటూ వైఎస్ జగన్‌కు సోమిరెడ్డి చురకలంటించారు. ఆ క్రమంలోనే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ పైవిధంగా స్పందించారు.
Also Read: జగన్ రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు'
Also Read: జగన్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించిన ఏపీ టీడీపీ చీఫ్
For AndhraPradesh News And Telugu News