Home » Adinarayana Reddy
ఆర్టీపీపీ దగ్గర మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జేసీ లారీలకు ఫ్లైయాస్‌ను లోడ్ చేయకుండా జమ్మలమడుగు నేతలు అడ్డుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో లారీలు, టిప్పర్లను జేసీ వర్గీయులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఆదిపత్యపోరు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. రెండు జిల్లాల నేతలు పట్టువదలడంలేదు. సీఎం చంద్రబాబు పంచాయతీ చేసినా కూడా వారు పట్టించుకోవడంలేదు.
కడప జిల్లా: తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. ఆర్టీపీపీ దగ్గర, అనంతపురం కడప జిల్లాల బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర పోలీసు బలగాల పికేటింగ్ కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన లారీలు తాడిపత్రి నుండి వచ్చిఆర్టీపీపీ దగ్గర ఆగిపోయాయి. రెండు రోజుల క్రితం ప్లైయాష్ కోసం వచ్చి వాహనాలు ఆగిపోయాయి.
ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాస్ పౌడర్ తాడిపత్రికి తరలించే విషయంలో జేసీ బ్రదర్స్.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఆ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. అటు తాడిపత్రి నుంచి జేసీ వర్గీయులు మళ్లీ వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలు మొహరించాయి.
అవును.. మీరు వింటున్నది నిజమే..! త్వరలో కడప పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక రాబోతోందని ఒక ఎమ్మెల్యే, ప్రభుత్వంలోని కీలక వ్యక్తి చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడితే హాట్ టాపిక్ అయ్యింది.. ఎవరి నోట విన్నా.. సోషల్ మీడియాలో చూసినా దీని గురించే చర్చ.. అంతకుమించి రచ్చ!..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం పాలైన తర్వాత ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 సీట్లకు పరిమితం కావడం.. ఇక 25 ఎంపీ స్థానాల్లో కేవలం 04 స్థానాల్లోనే గెలవడంతో పార్టీకి గడ్డు పరిస్థితులు వచ్చినట్లయ్యింది...
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సునామీ సృష్టించారు. గెలుపు కిక్ నుంచి ఇంకా శ్రేణులు బయటికి రాలేదు. అయితే ఇంతలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి. మోదీ మూడోసారి ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ఈనెల 12వ తేదీ బుధవారం నాడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. .